కొత్త మహీంద్రా థార్ కొత్త లుక్ తో, అప్‌డేటెడ్ ఎక్స్‌టిరియర్స్, ఇంటీరియర్ మాత్రమే కాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో మరింత శక్తివంతమైన బిఎస్ 6-కంప్లైంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో వస్తుంది.
వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియాలో కొత్త థార్‌ను ఆవిష్కరించింది. సెకండ్ జనరేషన్ థార్ అక్టోబర్ 2న విడుదల కానుంది. కొత్త మహీంద్రా థార్ కొత్త లుక్ తో, అప్‌డేటెడ్ ఎక్స్‌టిరియర్స్, ఇంటీరియర్ మాత్రమే కాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో మరింత శక్తివంతమైన బిఎస్ 6-కంప్లైంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో వస్తుంది.
కొత్త మహీంద్రా థార్‌లో ఎంస్టాలియన్ 150, 2.0-లీటర్, టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్ అమర్చారు, ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది. MHawk 130, 2.2-లీటర్, టర్బో డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ రెండు వెరీఎంట్స్ లో 6-స్పీడ్ ఎమ్‌టి, 6-స్పీడ్ ఎటి (టార్క్ కన్వర్టర్) ఆప్షన్స్ ఉన్నాయి. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణంతో వాహన తయారీదారు మూడవ తరం ప్లాట్‌ఫాంపై ఈ ఎస్‌యూవీ ఆధారపడి ఉంటుంది. కొత్త థార్ 650 ఎంఎం వాటర్ వాడింగ్ సామర్ధ్యం, 226 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది.
also read మారుతి సుజుకి ఆల్టో మరో రికార్డు.. ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ కార్.. ...
సెకండ్ జనరేషన్ మహీంద్రా థార్ లో రౌండ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్‌తో అప్‌డేటెడ్ ఫ్రంట్‌ను పొందుతుంది. ముందు బంపర్ కూడా రిడిజైన్ చేశారు. ఫగ్ లైట్స్, ఎస్‌యూవీలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు కూడా ఉన్నాయి. కొత్త మహీంద్రా థార్ వెనుక భాగం కూడా అడ్జస్ట్ చేశారు. కొత్త టెయిల్ లైట్లను కూడా అమర్చారు.
ముందు సీట్లు, ఎత్తు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ జనరేషన్ థార్‌లో ప్రీమియం ఫాబ్రిక్ అప్హోల్‌స్టరీని ఉపయోగించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. కొత్తగా 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది.
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సరికొత్తది, టిఎఫ్‌టి డిస్ ప్లే, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆడియో, క్రూయిజ్ ఫంక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త థార్ లో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ జోడించింది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ తో పాటు రెండవ తరం థార్‌కు టైట్రానిక్స్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, హిల్ హోల్డ్, హిల్ డీసెంట్ కంట్రోల్ ఉన్నాయి.
సెకండ్ జనరేషన్ మహీంద్రా థార్ రెండు సిరీస్ లో వస్తుంది - ఏఎక్స్ సిరీస్, ఎల్‌ఎక్స్ సిరీస్. కొత్త మహీంద్రా థార్ లో రెడ్ రేజ్, మిస్టిక్ కాపర్, గెలాక్సీ గ్రే, నాపోలి బ్లాక్, ఆక్వామారిన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.