ఏడాది చివరలో భారత్‌లోకి ఎంజీ తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

By rajesh y  |  First Published Apr 10, 2019, 6:04 PM IST

 బ్రిటన్ వాహన తయారీ దిగ్గజం ఎంజీ(మోరీస్ గ్యారేజెస్) మోటార్స్  తన గ్లోబల్ ప్యూర్ ఎలక్ట్రిక్ SUV-MG eZS అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. 


న్యూఢిల్లీ: బ్రిటన్ వాహన తయారీ దిగ్గజం ఎంజీ(మోరీస్ గ్యారేజెస్) మోటార్స్  తన గ్లోబల్ ప్యూర్ ఎలక్ట్రిక్ SUV-MG eZS అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. భారతదేశంలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో మనదేశంలో ప్రవేశిస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కానుంది.

ఇండియాతోపాటు యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో పర్యావరణ అనుకూలంగా జీరో ఎమిషన్స్‌తో పాటు ఆధునిక డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎంజీ జడ్ఎస్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపింది. 

Latest Videos

ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెడతామని, ఫీచర్, ధర మిగితా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని  ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా వివరించారు. 

కాగా, తొలి ఇంటర్నెట్ కారైన ‘హెక్టార్’ను వచ్చే జూన్‌లో విడుదల చేయబోతున్నట్లు ఎంజీ సంస్థ ప్రకటించింది. ఐస్మార్ట్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించడానికి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్, సాప్‌లతో జత కట్టింది. 

తొలి ఇంటర్నెట్ ఎస్‌యూవీ అయిన హెక్టార్‌లో ఇన్ బిల్ట్‌గా 5జీ స్మార్ట్ సిమ్‌ను అందిస్తుండటం విశేషం. కాగా, బటన్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ద్వారా ‘హలో ఎంజీ’ అంటూ కారు రూఫ్, డోర్లు తెరవమని ఆదేశించవచ్చు. ఇది ఇలావుంటే, విద్యుత్ తో నడిచే వాహనాలను కూడా విడుదల చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.

click me!