దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ వెన్యూ బ్లూలింక్ టెక్నాలజీతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. వచ్చేనెలలో భారత విపణిలో అడుగు పెట్టనున్న ఈ లుక్రేటివ్ సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారులో కార్ల ప్రేమికులకు అవసరమైన పలు సేఫ్టీ తదితర ఫీచర్లను చేర్చారు.
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్’ డిజైన్ చేసిన లుక్రేటివ్ సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘వెన్యూ’లో పలు ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో తొలిసారి హ్యుండాయ్ విక్రయించనున్న సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారు కానున్నది.
ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘వెన్యూ’లో బ్లూ లింక్ అనే గ్లోబల్ కనెక్టెడ్ టెక్నాలజీని అందుబాటులోకి రానున్నది. ఈ టెక్నాలజీతో సాయంతో 33 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కనెక్టెడ్ ఫీచర్లను ఈ కారులో పొందుపర్చినట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా పేర్కొన్నది.
భారత దేశంలో కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన తొలి కారు హ్యుండయ్ వెన్యూ కానుంది. ఈ కారులో ఉండే ఈ-సిమ్‌కు నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం కంపెనీ వొడాఫోన్ ఐడియాతో జత కట్టింది.
ఈ- సిమ్‌తో ఆటోమెటిక్ కార్ క్రాష్ నోటిఫికేషన్ అండ్ అసిస్టెన్స్, ఎస్‌ఓఎస్ ఎమర్జెన్సీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలను అందుబాటులోకి తెస్తోంది. అలాగే, ఇంజన్ స్టార్ట్ లేదా స్టాప్ వంటి రిమోట్ ఫంక్షన్స్, క్లైమేట్ కంట్రోల్, డోర్ లాకింగ్, అన్ లాకింగ్, జియో ఫెన్సింగ్, స్పీడ్ అలర్ట్స్, ఎస్వోఎస్, పానిక్ నోటిఫికేషన్, డిస్టినేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
మారుతీ విటారా బ్రెజ్జా, టాటా నెక్జాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌కు పోటీగా కంపెనీ ఈ కారును మార్కెట్లోకి విడుదల చేస్తోంది. భారతదేశంలో ఆదరణ పొందిన ఎస్ యూవీ మోడల్ క్రె్టా మోడల్‌లోనే వెన్యూ కారును డిజైన్ చేశారు. దాదాపు 30 రకాల కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి భారతదేశంలో
బ్లూ లింక్ టెక్నాలజీ, దాని ఫీచర్లను కస్టమర్లకు వివరించేందుకు వీలుగా తమ సేల్స్ నెట్‌వర్క్‌లోని 10 వేల మంది కన్సల్టెంట్లకు ఈ సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నట్లు హ్యుండయ్ మోటార్ వెల్లడించింది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ ఈ కారులో అందుబాటులో ఉన్న స్పెషల్ ఫీచర్లు కానున్నాయి.
భారతదేశంలో పరిస్థితులకు అనుగుణంగా బ్లూ లింక్ టెక్నాలజీని తరుచుగా తనిఖీ చేశాకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు హ్యుండాయ్ ఇండియా తెలిపింది. బ్లూ లింక్ టెక్నాలజీ వల్ల వాయిస్ గైడెన్స్, భారత్ యాక్సెంట్ ఇంగ్లిష్ గుర్తిస్తుంది. క్లైమేట్ కంట్రోల్, హార్న్, హెడ్ ల్యాంప్స్ వంటి వాటిని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయొచ్చు.