ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న మెర్సిడెస్ బెంజ్.. కస్టమర్ల కోసం సరికొత్త 'అన్‌లాక్ క్యాంపెయిన్'

By Sandra Ashok Kumar  |  First Published Nov 5, 2020, 2:03 PM IST

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కార్లను కొనుగోలు చేయడం నుండి ‘అన్‌లాక్ క్యాంపెయిన్’ తో కరోనా మహమ్మారి సమయంలో సురక్షితంగా ఉండేలా ప్రోత్సహించడం వరకు మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలోని ఆటోమొబైల్ విభాగంలో సంచలనం సృష్టిస్తోంది.


 భారతదేశ అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కస్టమర్లకు వారి డ్రీమ్ కారును సులభంగా కొనుగోలు చేయడానికి కృషి చేస్తోంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కార్లను కొనుగోలు చేయడం నుండి ‘అన్‌లాక్ క్యాంపెయిన్’ తో కరోనా మహమ్మారి సమయంలో సురక్షితంగా ఉండేలా ప్రోత్సహించడం వరకు మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలోని ఆటోమొబైల్ విభాగంలో సంచలనం సృష్టిస్తోంది. పండుగ సీజన్‌ రావడంతో లగ్జరీ మెర్సిడెస్ బెంజ్‌ కారును సొంతం చేసుకోవడానికి కస్టమర్ల ముందుకు మరో కొత్త మార్గాన్ని తీసుకొచ్చారు. 


 మనము ఇంట్లో లేదా కార్లలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాము, ఇందుకోసం  సురక్షితమైన, నమ్మదగిన వాహనాన్ని సొంతం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ పండుగ సీజన్ లో మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా, అయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మెర్సిడెస్ బెంజ్ అన్ని చెక్‌మార్క్‌లతో ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది. ఈక్యూ  బూస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరాతో యాక్టివ్ పార్క్ అసిస్ట్, నేచురల్ వాయిస్ అసిస్ట్‌తో ఎన్‌టి‌జి 6 ఎం‌బి‌యూ‌ఎక్స్, కొత్త మెర్సిడెస్ బెంజ్ మీ యాప్ వంటి బెస్ట్  టెక్నాలజి ఫీచర్స్  ను అందిస్తున్నది.

Latest Videos

 ఎయిర్‌బ్యాగులు, ఆఫ్ రోడ్ ఏబిఎస్, ఏడిఎస్ + తో ఎయిర్ మాటిక్ సస్పెన్షన్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్,  స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, కారు ముందు మరియు వెనుక భాగంలో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్టులు, సింగిల్ టచ్ ఫోల్డ్ సీట్లు, కార్ బ్రేక్ డౌన్  అయినప్పుడు ఆన్-రోడ్ ఆసిస్టెన్స్, అత్యవసర సేవల కోసం SOS బటన్, 24/7 అల్ లైన్ సర్వీస్ ఈ ఫీచర్స్ అన్నీ కారు కొనుగోలుతో పాటు కస్టమర్లకు అందించే అద్భుతమైన సర్వీస్ తో కలిపి వస్తుంది. అద్భుతమైన కస్టమర్ అనుభవాన్ని అందించే ప్రయత్నంలో మెర్సిడెస్ బెంజ్ ఒక మంచి పరిష్కారాన్ని తెచ్చింది, దీని ద్వారా మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రీ అప్రూవ్డ్  లోన్ ఆఫర్‌ను అందిస్తుంది.   

 

మొదట ఫార్మ్ దరఖాస్తు ఓటిపితో సబ్మిట్ చేయలి, దరఖాస్తు ఫారంలో అందించిన వివరాల ప్రాస్పెక్టివ్ క్రెడిట్ బ్యూరో చెక్ చేయడానికి సహాయపడుతుంది. బ్యూరోలో ప్రాస్పెక్ట్ వివరాలు ఉన్న తర్వాత, ముందుగా ఆమోదించిన లోన్ ఆఫర్ అర్హతను చెక్ చేయడానికి డి‌ఎఫ్‌ఎస్‌ఐ క్రెడిట్ నియమాలు ప్రేరేపించబడతాయి. అన్ని నియమాలతో కస్టమర్లు సంతృప్తి చెందితే లోన్ పై ఆమోదం లభిస్తుంది. ఫారం నింపడానికి 30 సెకన్ల కన్నా తక్కువ సమయం పడుతుంది, ఫారం విజయవంతంగా సమర్పించిన తర్వాత కొనుగోలుదారులు 30 సెకన్లలోపు అనుమతి పొందుతారు. గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మెర్సిడెస్ బెంజ్ కారు కొనడానికి ముందుగా ఆమోదించిన(ప్రీ అప్రూవ్డ్) లోన్ మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయదు. కాబట్టి మీ క్రెడిట్ హిస్టరీ పై ప్రభావం లేకుండా మీరు ఉత్తమమైన డీల్స్ పొందుతారు. సూపర్ సొనిక్ యుఎక్స్ అనేది మెర్సిడెస్ బెంజ్ కారును కొనాలనుకునే వారికి అద్భుతమైన కస్టమర్ అనుభవాన్ని అందించే వేగవంతమైన పరిష్కారం.

మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

click me!