దీపావళి ఫెస్టివల్ ధమాకా.. బిఎస్ 6 కార్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు..

By Sandra Ashok Kumar  |  First Published Nov 4, 2020, 11:38 AM IST

టాటా మోటార్స్ బిఎస్ 6-కంప్లైంట్ పాపులర్  మోడల్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ నుండి  ఎంచుకున్న మోడళ్లపై రూ.65వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు.


దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో భారతీయ కార్ల తయారీ సంస్థ  టాటా మోటార్స్ బిఎస్ 6-కంప్లైంట్ పాపులర్  మోడల్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ నుండి  ఎంచుకున్న మోడళ్లపై రూ.65వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు.

ఇందులో టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్, టాటా టైగర్ సెడాన్, టాటా నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, టాటా హారియర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఉన్నాయి. ఈ సెలెక్టెడ్ బిఎస్ 6 టాటా కార్లపై ఈ ఆఫర్ నవంబర్ 1 నుండి 30 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, కార్పొరేట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.  

Latest Videos

టాటా హారియర్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ.65వేల వరకు తగ్గింపును అందిస్తుండగా టాటా ఆల్ట్రోజ్‌పై స్పెషల్ బెనెఫిట్స్ కూడా ప్రవేశపెట్టాయి.  

also read కారు ఇంజన్ వేడేక్కుతుందా అయితే వెంటనే ఇలా చేయండి.. లేదంటే ప్రమాదం జరగవవచ్చు.. ...

టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ పై మొత్తం రూ.25వేల వరకు ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చు. కంజ్యూమర్ స్కీమ్ ద్వారా  రూ.15వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 10వేలు ప్రత్యేకంగా అందిస్తుంది. టాటా టైగర్ సెడాన్ పై గరిష్టంగా రూ.30వేల  బెనెఫిట్స్ అందిస్తుంది. 

టాటా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా పండుగ ఆఫర్లలో ఒక భాగంగా ఉంది. నెక్సాన్ ఎస్‌యూవీ పై లిమిటెడ్ ఆఫర్‌లతో అందిస్తున్నారు, ఇందులో డీజిల్ వేరియంట్‌పై మాత్రమే రూ.15వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. పెట్రోల్ వేరియంట్లపై ఎలాంటి ఆఫర్లు లేవు.

టాటా హారియర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీపై మొత్తం డిస్కౌంట్ రూ.65వేల వరకు ఉంది. ఇందులో కంజ్యూమర్ స్కీమ్ రూ.25వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.25వేలు ఉన్నాయి. హారియర్ డార్క్ ఎడిషన్, ఎక్స్‌జెడ్ +, ఎక్స్‌జెడ్‌ఏ + వేరియంట్లపై  ఈ ఆఫర్లు వర్తించవు. ఈ వేరియంట్‌లను ఎంచుకునే కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ.40వేల వరకు ఆఫర్లను పొందవచ్చు.
 

click me!