మీ కారులో వీటిని తరచూగా చెక్ చేయండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు : నిపుణుల అంచనా

By Sandra Ashok Kumar  |  First Published Nov 4, 2020, 5:09 PM IST

మీరు కారును ఎక్కువగా వాడే వారు అయితే  దాని నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ కారు లైఫ్ ఎలా కాపాడుకోవాలో ఒకసారి తెలుసుకుందాం…


 ఏదైనా కారణం వల్ల మీ కారును ఒకే చోట ఎక్కువ రోజులు  పార్క్ చేసి ఉంటే అది కారు లైఫ్ దెబ్బతిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా కారు నడపడం వల్ల కారులో కొన్ని సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే మీరు కారును ఎక్కువగా వాడే వారు అయితే  దాని నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ కారు లైఫ్ ఎలా కాపాడుకోవాలో ఒకసారి తెలుసుకుందాం…

Latest Videos


15 నిమిషాలు స్టార్ట్ చేసి ఉంచండి: మీ కారు ఎక్కువ రోజులు పార్క్ చేసి ఉంటే, మొదట మీ వాహనాన్ని స్టార్ట్ చేసి, ఇంజన్ను సుమారు 15 నిమిషాలు అలానే ఉంచండి. ఒకవేళ మీరు కారును ఎక్కువగా వాడకపోతే ఇలా నెలకు కనీసం 1 సారి అయినా చేయాలని నిపుణులు భావిస్తున్నారు.

ఇది మీ వాహనం బ్యాటరీ లైఫ్, కండిషన్ మెరుగుపరుస్తుంది. అలాగే, మీ కారు బ్యాటరీ లేదా ఇంజన్ లో ఏదైనా సమస్య ఉందా అనేది కూడా తెలుసుకోవాలి.

టైరులో గాలి చెక్ చేయాలి: కారు స్టార్ట్ చేసే ముందు టైర్‌లోని గాలి లెవెల్  చెక్ చేయడం చాలా ముఖ్యం. కారును ముందుకు, వెనుకకు తిప్పడం ద్వారా టైర్‌లోని గాలిని చెక్ చేయవచ్చు. టైర్‌లో తక్కువ గాలి ఉంటే కారు ఇంజన్‌పై  ఒత్తిడి పెరుగుతుంది.

ఇది కారు మైలేజీపై కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది. అదనంగా, టైర్లలో తక్కువ గాలి వల్ల టైర్లను దెబ్బతీస్తుంది. వారు త్వరగా అరిగిపోతాయి, వారి లైఫ్ కూడా తగ్గిపోతుంది.

also read 

    
బ్రేకుల నిర్లక్ష్యం మంచిది కాదు: మీ కారును ఎక్కువ దూరం నడిపే ముందు బ్రేకులు చెక్ చేయాలి. మీ కారు బ్రేక్‌ల పనితిరు తగ్గితే, వెంటనే దాన్ని మెకానిక్‌కు చూపించండి. వర్షపు కాలంలో కూడా బ్రేకులు త్వరగా క్షీణిస్తాయి.

అలాగే, మీ కారు బ్రేకింగ్ చెక్ చేసేటప్పుడు శబ్దం వస్తే, దానిలో సమస్య ఉన్నట్లు. ఈ నిర్లక్ష్యం మీకు ప్రమాదం కావొచ్చు. అందువల్ల, బ్రేక్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేయండి.


ఇంజన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి: కారు మొత్తం పనితీరు ఇంజన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇంజన్ ఆయిల్ కారు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి 15-20 రోజులకు కారు ఇంజన్ ఆయిల్ చెక్ చేస్తూ ఉండండి.

కారు  ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుందా లేదా అని గమనించండి. ఆయిల్ లీక్ అవుతుంటే వెంటనే దాన్ని మీ మెకానిక్ ద్వారా చెక్  చేయించండి.

click me!