కార్ల విక్రయాలు మందకోడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి వరుసగా మూడో నెల ఏప్రిల్‌లోనూ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది.
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో దాదాపు 10శాతం ఉత్పత్తిని తగ్గించినట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గురువారం తెలిపింది. ఈ కంపెనీ వరుసగా ఉత్పత్తిని తగ్గించడం ఇది మూడోసారి. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా కంపెనీ ఉత్పత్తిని తగ్గించింది.
9.6 శాతం తగ్గిన మారుతి కార్ల ఉత్పత్తి
ఏప్రిల్‌లో 1,47,669 యూనిట్లను మారుతి సుజుకి ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే ఇది 9.6శాతం తక్కువ. ఈ విషయాన్ని మారుతీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
గురుగ్రామ్, మానెసర్ ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వెహికల్స్ ఉత్పత్తి సామర్థ్యం
మారుతీ సుజుకీకి ఉన్న గుర్‌గ్రామ్, మానెసర్ ప్లాంట్లలో ఏటా 15.5లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇక సుజుకీకి మాత్రమే చెందిన హన్సల్పూర్ ప్లాంట్‌కు 2.5లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
కొత్త తరహా వాహనాలపై ప్రజల మోజు
దేశీయంగా కార్ల మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో పాటు కొత్త తరహా వాహనాలకు ఎక్కవ మంది ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో మారుతీ సుజుకీ సంస్థ కొన్ని మోడళ్ల ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో కంపెనీ ఉత్పత్తి తగ్గిస్తుండడ పట్ల కార్మికుల్లో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి.
స్విఫ్ట్, డిజైర్, ఆల్టో కార్ల ఉత్పత్తి నిలిపివేత
ప్రత్యేకించి డిమాండ్ లేని స్విఫ్ట్, బాలెనో, ఆల్టో కార్ల ఉత్పత్తిని తగ్గించి వేసింది. ఈ మోడల్స్ కార్లతో కలిపి 9.6 శాతంతో 1,63,368 యూనిట్ల కార్ల ఉత్పత్తి నిలిపివేసింది.
మార్చి, ఫిబ్రవరి నెలల్లో ఇలా మారుతి..
అంతకుముందు మార్చిలో 21 శాతంతో 1,36,201 కార్లు, ఫిబ్రవరిలో 8.3 శాతంతో 1,48,959 కార్ల ఉత్పత్తిని తగ్గించివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 4-8 శాతం పురోగతి సాధిస్తుందని సంస్థ యాజమాన్యం అంచనా వేసింది.
కంపాక్ట్, మినీ కార్ల విభాగంలో లీడరైనా..
తాజాగా ఏప్రిల్ నెలలో సూపర్ క్యారీ ఎల్సీవీ వాహనాలతో కలిపి 1,49,669 కార్లను మారుతి సుజుకి నిలిపివేసింది. కంపాక్ట్ సెగ్మెంట్, మినీ కార్ల విభాగంలో మారుతి సుజుకి లీడర్ అయినా సేల్స్ పడిపోవడంతో ఉత్పత్తి తగ్గించక యాజమాన్యానికి తప్పడం లేదు.
66% తగ్గిన అపోలో టైర్స్ లాభం
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అపోలో టైర్స్ రూ.83.99 కోట్ల ఏకీకృత నికర లాభం నమోదు చేసింది. 2017-18 చివరి త్రైమాసికంతో పోలిస్తే సంస్థ నమోదు చేసిన రూ.250.10 కోట్లతో పోలిస్తే ఇది 66.41 శాతం తక్కువ. ఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు సంబంధించిన రూ.100 కోట్లను మార్చి త్రైమాసికంలో రైటాఫ్ చేసినందునే లాభం తగ్గిందని కంపెనీ సమాచారం ఇచ్చింది.
రూ.200 కోట్ల ఐఎల్ఎఫ్ఎస్ రుణాలు రైటాప్ చేసిన అపొలో టైర్స్
2018-19లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు సంబంధించిన మొత్తం రూ.200 కోట్లను సంస్థ రైటాఫ్ చేసింది. సమీక్షా త్రైమాసికంలో విక్రయాలు రూ.4,176.25 కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి రూ.3,982.43 కోట్లు. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.723.88 కోట్ల నుంచి 6.08 శాతం తగ్గి రూ.679.84 కోట్లకు తగ్గింది.
ముడి వస్తువుల ధరల్లో పెరుగుదలతోనే లాభాలకు గండి
విక్రయాలు రూ.14,928.95 కోట్ల నుంచి రూ.17,273.39 కోట్లకు చేరాయి. ‘సమీక్షా త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేయగలిగాం. ముడి వస్తువుల ధరలు 10 శాతం వరకు పెరగడంతో ఆ ప్రభావం నికర లాభంపై పడింద’ని అపోలో టైర్స్ ఛైర్మన్ ఓంకార్ ఎస్.కన్వర్ తెలిపారు.