ప్రయాణికుల కార్ల విక్రయాల్లో మారుతి సుజుకికి చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘ఆల్టో’ అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కార్లలో ఏడింటిలో మారుతి, మరో మూడింట దక్షిణ కొరియా హ్యుండాయ్ అనుబంధ సంస్థ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2018-19) అత్యధికంగా అమ్ముడుపోయిన ప్రయాణికుల కార్లలో మారుతి సుజుకీ ఆల్టో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆక్రమించింది. దేశంలో అధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 10 ప్రయాణికుల కార్లలో ఏడు మారుతీ కంపెనీవే ఉన్నాయి.
మరో మూడు స్థానాలను దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్‌కు చెందిన కార్లు ఆక్రమించాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. ప్రయాణికుల వాహనాల విభాగంలో ఈ రెండు కంపెనీలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
మారుతీ సుజుకీ ఇండియా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో అత్యధికంగా విక్రయమైన కారుగా రికార్డు సృష్టించింది.మారుతీ సుజుకీకి చెందిన ఏడు కార్లు టాప్-10 కార్లలో జాబితాలో ఉన్నాయి. 2,59,401 కార్ల విక్రయంతో మారుతి ‘ఆల్టో’ అగ్రస్థానంలో నిలిచింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 2,58,539 ఆల్టో కార్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలోనూ మారుతీకి చెందిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ 2,53,859 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.
2017-18లో స్విఫ్ట్ నాలుగో స్థానంలో ఉంది. 2,12,330 కార్ల విక్రయంలో బాలెనో నాలుగో స్థానంలో ఉంది. 2017-18లో మూడో స్థానంలో ఉన్న బాలెనో గత ఏడాది నాలుగో స్థానానికి దిగజారింది. విటారా బ్రెజ్జా రెండు స్థానాలు పైకి ఎగబాకి 1,57,880 కార్ల విక్రయంతో ఐదో స్థానంలో ఉంది.
ఇక హ్యుండయ్ మోటార్స్‌కు చెందిన ఎలైట్ ఐ20 1,40,225 కార్ల విక్రయంతో ఆరో స్థానంలో నిలిచింది. 2017-18తో పోల్చితే రెండు స్థానాలు పైకి ఎగబాకింది.
1,26,041 కార్ల విక్రయంతో ఎంట్రీ లెవెల్ కారు గ్రాండ్ ఐ10 ఏడో స్థానంలో ఉంది. హ్యుండాయ్ మోటార్స్ కంపెనీకే చెందిన ఎస్‌యువీ మోడల్ క్రెటా 1,24,300 కార్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.
1,19,649 కార్ల విక్రయంలో మారుతీ సుజుకీ వాగన్ ఆర్ తొమ్మిదో స్థానంలో 1,03,734 కార్ల అమ్మకంతో సెలేరియో పదో స్థానంలో ఉన్నాయి.