మారుతీ సుజుకీ కంపెనీ మాత్రం ముందుగానే బీఎస్-6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ ఆఫర్లు ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
న్యూఢిల్లీ: బీఎస్-4 వాహనాల అమ్మకాలకు గడువు ముంచుకొస్తుండడంతో ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ప్రమాణాలు కలిగిన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అనేక కార్లు, టూవీలర్ తయారీ కంపెనీలు బీఎస్-4 వాహనాలపై ఇప్పటికే భారీ డిస్కౌంట్లతో ఆఫర్ చేస్తున్నాయి.
అయితే మారుతీ సుజుకీ కంపెనీ మాత్రం ముందుగానే బీఎస్-6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ ఆఫర్లు ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇక మారుతీ సుజుకీ తన బీఎస్-6 కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు.
undefined
also read త్రీడీ స్కానింగ్ టెక్నాలజీతో కొత్త హ్యుండాయ్ క్రెటా...17 నుంచి బుకింగ్స్
మారుతీ సుజుకీ సియాజ్ : ఈ కారుపై వినియోగదారులకు రూ.45వేల వరకు ప్రయోజనాలు అందిస్తుంది. రూ.10వేల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.25వేల వరకు బోనస్ ఎక్స్‌ఛేంజ్, మరో రూ.10వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఇక ఈ కారుకు చెందిన అన్ని వేరియెంట్లపై ఎంపిక చేసిన ఆఫర్లను అందిస్తున్నారు. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. రూ.8.31 లక్షల ప్రారంభ ధరకు ఈ కారు అందుబాటులో ఉంది. టాప్ మోడల్ కారు ధర రూ.11.09 లక్షలుగా ఉంది.
మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్6: మారుతీ సుజుకీ కంపెనీ ఎక్స్‌ఎల్6 ఎంపీవీ కారుపై రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌గా అందిస్తున్నారు. ఇందులో 6 సీట్లు కాపాసిటి ఉన్న కారు. దీనికి రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. రూ.9.84 లక్షల ప్రారంభ ధరకు ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.
also read ఆ వెహికల్స్ సేల్స్ ఇక కష్టమే...ఆటోమొబైల్ డీలర్ల ఆందోళన ?
మారుతీ సుజుకీ బలెనో: బలెనో కారుపై రూ.20వేల వరకు డిస్కౌంట్, రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇంకా రూ.5వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ.5.70 లక్షలకు అందుబాటులో ఉంది, దీని టాప్ మోడల్ వేరిఎంట్ ధర రూ.9.03 లక్షలు.
మారుతీ సుజుకీ ఇగ్నిస్: చిన్న కారులో ఒకటైన మారుతీ సుజుకీ ఇగ్నిస్ బీఎస్-6 వేరియెంట్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. భిన్న రకాల వేరియెంట్లలో ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది.
ఈ కారుకు చెందిన సిగ్మా వేరియెంట్‌పై రూ.20వేల వరకు క్యాష్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే డెల్టా, జెటా, ఆల్ఫా ట్రిమ్ వేరియెంట్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంతే కాకుండా రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.5వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది.