దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ నూతన తరం క్రెటా కారును విపణిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆ కారు రెండు ఏనుగుల్ని మోయగల సామర్థం కలిగి ఉంటుంది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అత్యంత దృఢమైన స్టీలుతో.. తన కొత్త రకం కార్లను రూపొందించింది హ్యుండాయ్ కంపెనీ. సుమారు 12 టన్నుల బరువును తట్టుకునే సామర్థ్యాన్ని వీటికి కల్పించింది. అంటే ఇంచుమించు రెండు ఆఫ్రికన్ ఏనుగుల బరువు ఉంటుంది.
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుండాయ్ తాజాగా నూతన తరం క్రెటా కారు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. మార్చి 17 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం. దీనిలో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండనున్నాయని ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. దీని బాడీ అత్యంత దృఢంగా ఉండనుందని తెలిపింది.
దాన్ని తయారు చేయడానికి వినియోగించిన మెటీరియలే దీనికి కారణం అని హ్యుండాయ్ తెలిపింది. సూపర్‌స్ట్రక్చర్’గా పిలుస్తున్న ఈ బాడీని 74.30 శాతం ‘అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్’తో తయారు చేసినట్లు వివరించింది.
undefined
also read ఆ వెహికల్స్ సేల్స్ ఇక కష్టమే...ఆటోమొబైల్ డీలర్ల ఆందోళన ?
దాదాపు 12 టన్నుల బరువును.. ఇది తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. ఒక్క ఆఫ్రికన్ ఏనుగు బరువు 2.5 నుంచి 7 టన్నులు ఉంటుంది. ఈ లెక్కన ఈ కారు బాడీ.. రెండు ఏనుగుల్ని మోయగలదని తెలిపింది. దీనికి మునుపటి తరం క్రెటా 4 స్టార్ రేటింగ్ పొందింది. రానున్న నూతన క్రెటా ఏ తరహా రేటింగ్ అందుకోనున్నదో వేచి చూడాల్సిందే.
తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ తయారీ కేంద్రంలో ఇప్పటికే నూతన తరం క్రెటా కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. దీని తయారీ ప్రక్రియలో తొలిసారి ‘త్రీడీ స్కానింగ్ టెక్నాలజీ’ని వినియోగించినట్లు హ్యుండాయ్ కంపెనీ తెలిపింది.
also read 70 సేఫ్టీ, సెక్యూరిటి ఫీచర్లతో ఫియట్ క్రిస్లర్ కొత్త జీప్ రాంగ్లర్...
హ్యుండాయ్ నూతన క్రెటా కారు ఇంటీరియర్‌లో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని సమాచారం. 10.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అమర్చినట్లు తెలుస్తోంది. టెస్లాలో ఇటువంటిదే అమర్చారు.
ఇక హ్యుండాయ్ బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ యాప్, ఈసిమ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి రూ.10లక్షల నుంచి రూ.17లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.