ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా హార్ట్ టచింగ్ వీడియో..నన్ను చాలా తొందరగా ఏడ్పించేసింది అంటూ పోస్ట్..

Ashok Kumar   | Asianet News
Published : Dec 16, 2020, 03:04 PM ISTUpdated : Dec 16, 2020, 11:12 PM IST
ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా హార్ట్ టచింగ్ వీడియో..నన్ను చాలా తొందరగా ఏడ్పించేసింది అంటూ పోస్ట్..

సారాంశం

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మనసుకు హత్తుకునే ఒక క్రిస్మస్ వీడియోను  ట్విట్టర్‌ ద్వారా  పోస్ట్ చేస్తూ ఈ పోస్ట్ లో "షూట్; మీరు నన్ను చాలా తొందరగా ఏడ్పించేశారు. నాకు ఇంకా మనవరాలు లేదు కాని నా ఆ వయసు ఉన్న మనవడు ఉన్నాడు…" అంటూ ట్వీట్ చేశాడు.  

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అనడంలో సందేహం లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతుండటంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఒక హృదయపూర్వకమైన వీడియోను షేర్ చేశారు, ఇది అతన్ని కన్నీరు పెట్టించింది అని అన్నారు.

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మనసుకు హత్తుకునే ఒక క్రిస్మస్ వీడియోను  ట్విట్టర్‌ ద్వారా  పోస్ట్ చేస్తూ ఈ పోస్ట్ లో "షూట్; మీరు నన్ను చాలా తొందరగా ఏడ్పించేశారు. నాకు ఇంకా మనవరాలు లేదు కాని నా ఆ వయసు ఉన్న మనవడు ఉన్నాడు…" అంటూ ట్వీట్ చేశాడు.

also read దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-12 ద్విచక్ర వాహన సంస్థల లిస్ట్ ఇదే.. ...

ఈ వీడియోలో ఒక వృద్ధుడు ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక ఫోటో ముందు వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామం ఎత్తడానికి ప్రయత్నిస్తుంటాడు. వీడియోలో వృద్ధుడు ఎందుకు  వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామం చేస్తున్నాడో తెలుసుకోవడానికి కొందరు చాలా  ప్రయత్నిస్తుంటారు. కానీ అది తన మనవరాలికి కోసం అని చివరికి తెలుస్తుంది. ఒక రోజు అంటే క్రిస్మస్ రోజున తన మానవరాలు ఒక బహుమతిని తెరుస్తుంది.

దాని లోపల ఒక క్రిస్మస్ నక్షత్రం ఉంది (దీనిని క్రిస్మస్ చెట్టు పైన అమర్చుతారు). చెట్టు మీద నక్షత్రం పెట్టడానికి తన మనవరాలిని పైకి ఎత్తుకుంటాడు అప్పుడు ఆమే నక్షత్రం క్రిస్మస్ చెట్టు పైన  అమర్చుతుంది.  తరువాత ఆ వృద్ధుడు ప్రతిరోజు  ఉదయం వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది.

 

చాలా మంది ఈ వీడియోను చూసి ఎమోషనల్ అయ్యారు . ఒక ట్విట్టర్ యూజర్ 'హార్ట్ టచింగ్ మెసేజ్, మెర్రీ క్రిస్మస్' అని కామెంట్ పోస్ట్ చేయగా, మరొక యూజర్  ఇలాంటి ఎమోషనల్ క్లిప్‌లు మమ్మల్ని ఏడిపించేస్తాయి అంటూ పోస్ట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా ప్రజలను ఉత్తేజపరిచేందుకు ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను ట్విట్టర్‌లో షేర్ చేస్తుంటారు.

ఆనంద్ మహీంద్రా చేసిన 2 నిమిషాల వీడియో ట్వీట్ కేవలం ఒక్క గంటలోనే  20వేల వ్యూస్ సాధించింది.

అంతకుముందు, 65 ఏళ్ల పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎనిమిదేళ్ల ఒక పిల్లాడి వీడియోను పోస్ట్ చేస్తూ "ప్రపంచంలో అత్యంత వేగవంతమైన పిల్లవాడు" అంటూ కామెంట్ పెట్టారు. వీడియోను షేర్ చేస్తూ "అతను ఒక యంత్రం లాంటివాడు అని అభినందించారు. అతను నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వ్యక్తి అవుతాడు" అని క్యాప్షన్‌లో రాశాడు.
 

PREV
click me!

Recommended Stories

Kia Seltos 2026 : కేక పుట్టిస్తున్న కొత్త కియా సెల్టోస్.. డిజైన్, ఫీచర్లు అదరహో !
Renault Duster: ఐకాన్ ఇజ్ బ్యాక్‌.. అదిరిపోయే అప్డేట్స్‌తో డ‌స్ట‌ర్ దూసుకొస్తోంది