కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మహీంద్రా కార్లపై ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..

By S Ashok Kumar  |  First Published Dec 14, 2020, 2:52 PM IST

ఇటీవల విడుదల చేసిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ మినహా మిగతా అన్ని మోడళ్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్ సేల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా బిఎస్ 6-కంప్లైంట్ మహీంద్రా కార్లపై 3.06 లక్షల బెనెఫిట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 


కార్ల తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా కొత్త కార్ల కొనుగోలుదారులకి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ మినహా మిగతా అన్ని మోడళ్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్ సేల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా బిఎస్ 6-కంప్లైంట్ మహీంద్రా కార్లపై 3.06 లక్షల బెనెఫిట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

భారతీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా వాహనాలపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, అదనపు ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది.  ఈ ప్రయోజనాలు 31 డిసెంబర్ 2020 వరకు మాత్రమే ఉంటుంది అని తెలిపాయి. అయితే ఇతర నగరాలు, ప్రాంతాల ఆధారంగా ధరలు, ఆఫర్లు మారవచ్చు.

Latest Videos

మహీంద్రా ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ బీఎస్‌6 ఆల్టూరస్‌ జీ4పై గరిష్ఠంగా రూ.3.06 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ కారు కొనుగోలు చేసే వారు రూ.2.20 లక్షల వరకు నగదు రాయితీతో పాటు రూ.50వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ.16వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌, రూ.20వేల వరకు ఇతర ప్రయోజనాలు పొందొచ్చని మహీంద్రా తెలిపింది.

ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ500పై రూ.51వేల వరకు, మహీంద్రా కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీపై రూ.62వేల వరకు, స్కార్పియోపై రూ.30వేల వరకు, బొలెరోపై రూ.20వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. మహీంద్రా కార్లపై ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను అందించడం లేదని పేర్కొంది.

also read 

మరోవైపు మహీంద్రా ఎక్స్‌యూవీ 500 పై  ఇచ్చే మొత్తం డిస్కౌంట్ రూ.51,200 వరకు ఉంది. ఇందులో 12,200 వరకు నగదు బెనెఫిట్స్, 20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 9వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, 10వేల వరకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్ టి పై మొత్తం రూ.62,055 బెనిఫిట్ తో వస్తుంది, ఇందులో రూ.38,055 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 4వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ పై గరిష్టంగా రూ.30,600 వరకు బెనెఫిట్స్ తో వస్తుంది. ఇందులో  రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.1,100 నగదు ఆఫర్, రూ.10వేల వరకు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

ఎక్స్‌యూ‌వి 300పై  రూ.25వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,500 వరకు అదనపు ఆఫర్లతో అందిస్తున్నారు. మహీంద్రా మరాజోను కొనడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులకు మొత్తం రూ.36వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.  
 

click me!