6 సెకన్లలో 100 కి.మీ స్పీడ్.. బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్ స్పెషాలిటీ

By Sandra Ashok Kumar  |  First Published Feb 14, 2020, 11:57 AM IST

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో తన బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్, మినీ క్లబ్ మ్యాన్ మోడల్ కార్లను ఆవిష్కరించింది. కేవలం 6.1 సెకెన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం బీఎండబ్ల్యూ 530ఐ మోడల్ ప్రత్యేకత. ఇక మినీ క్లబ్ మ్యాన్ పేరిట ఆవిష్కరించిన సరికొత్త మోడల్ కారు కేవలం 15 యూనిట్లు మాత్రమే భారత విపణిలో విక్రయిస్తున్నారు. శనివారం నుంచి అమెజాన్‌లో మినీ క్లబ్ మ్యాన్ కోసం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. 
 


న్యూఢిల్లీ: జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సెడాన్​ రకం బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్​ వాహనాన్ని భారత్​లో విడుదల చేసింది. దీని ధర రూ.55.4 లక్షలు (ఎక్స్​ షోరూమ్​). ఈ మోడల్​ను చైన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్​ ప్లాంట్​లో ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. 

అద్భుతమైన ఫీచర్లు సొంతం చేసుకున్న 530 ఐ
2-లీటర్​ బీఎస్​-6 ప్రమాణాలు, 4-సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​, 252 హెచ్​పీ సామర్థ్యం, 8-స్పీడ్​ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​తో దీన్ని రూపొందించినట్లు పేర్కొంది. 6.1 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఈ మోడల్​ను దేశీయంగా చెన్నై ప్లాంటులోనే తయారుచేసినట్లు కంపెనీ వెల్లడించింది. డిస్​ప్లే కీ, గెస్చర్ కంట్రోల్​, పార్కింగ్ అసిస్టెన్స్, రేర్​వ్యూ కెమెరా, పార్క్​ డిస్టెన్స్​ కంట్రోల్​ లాంటి సౌకర్యాలు కల్పించినట్లు సంస్థ తెలిపింది.

Latest Videos

undefined

also read అశోక్‌ లేలాండ్‌ లాభాల్లో క్షీణత...87% తగ్గిన...

నాలుగు రంగుల్లో బీఎండబ్ల్యూ 530ఐ లభ్యం
17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో రూపుదిద్దుకున్న బీఎండబ్ల్యూ 530ఐ మోడల్ కారు.. ఎయిర్ బ్రేకర్స్ కోసం అల్యూమినియం ఇన్ సర్ట్స్ అమర్చారు. ఈ కారు నాలుగు ఎక్స్ టీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మినరల్ వైట్, బ్లాక్ సఫైర్, మెడిటేరియన్ బ్లూ, బ్లూస్టోన్ మెటాలిక్ రంగుల్లో లభ్యమవుతుంది. 

నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్ బీఎండబ్ల్యూ 530 ఐ సొంతం
స్పోర్ట్స్ ట్రిమ్ కారులో స్మార్ట్ డిస్ ప్లే, గెస్చర్ కంట్రోల్, ఏ రివ్యూ కెమెరా, అంబియెంట్ లైటింగ్, సెన్సాటెక్ అప్ హెలెస్టరీ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్ కనెక్టివిటీతోపాటు 12 స్పీకర్ల సిస్టంతో కూడిన 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ వంటి ఫీచర్లు ఉన్నాయి. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్ దీని సొంతం. 

ఇవీ బీఎండబ్ల్యూలో జత కలిసిన హార్డ్ వేర్ ఫీచర్లు
డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్, హిల్ డిస్కెంట్ కంట్రోల్, రన్ ఫ్లాట్ టైర్లు, అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ తదితర హార్డ్ వేర్ ఫీచర్లు బీఎండబ్ల్యూ 530ఐ మోడల్ కారులో జత కలిశాయి. దేశంలోని అన్ని డీలర్ షిప్ షాపుల్లో ఈ కారు లభ్యమవుతుంది. ఏటా రూ.17,300 చెల్లిస్తే కస్టమర్లకు సర్వీస్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 

also read ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 షో...సందర్శకుల అనూహ్య రెస్పాన్స్...

భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ‘మినీ క్లబ్‌మాన్‌’
భారత మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ’ సంస్థ ‘మిని క్లబ్‌మాన్‌’ కారును ఆవిష్కరించింది. కేవలం 7.2 సెకన్ల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగిన ఈ పరిమిత ఎడిషన్‌ కారు ధర రూ. 44.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇండియన్‌ సమ్మర్‌ రెడ్‌ ఎడిషన్‌ పేరిట కేవలం 15 యూనిట్లు మాత్రమే ఇక్కడ విక్రయిస్తోంది. అమెజాన్‌ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్లో కారు బుకింగ్స్‌ ప్రారంభించనుంది. 

శనివారం నుంచి మినీ క్లబ్ మ్యాన్ బుకింగ్స్ ప్రారంభం
శనివారం నుంచి బీఎండబ్ల్యూ మినీ క్లబ్ మ్యాన్ కారు బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. వెనుకవైపు రెండు డోర్లు (స్లి్పట్‌ డోర్‌)తో కలిపి మొత్తం ఆరు డోర్లు కలిగిన ఈ కారుకు 2–లీటర్‌ 4–సిలెండర్‌ ఇంజిన్‌ను అమర్చింది. ట్విన్‌పవర్‌ టర్బో టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. 7–స్పీడ్‌ స్టెప్‌ట్రోనిక్‌ ట్రాన్స్‌మెషిన్‌ (డబుల్‌ క్లచ్‌) కలిగిన కొత్త కారు గరిష్టంగా గంటకు 228 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 

click me!