లాంబోర్గిని కొత్త మోడల్ కారు....కేవలం 3 సెకన్లలో టాప్ స్పీడ్...

By Sandra Ashok KumarFirst Published Jan 29, 2020, 4:09 PM IST
Highlights

లాంబోర్గిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి 5.2-లీటర్, వి10 బెల్టింగ్ 594 బిహెచ్‌పితో డబ్ల్యుడి వెర్షన్ కంటే తక్కువ పవర్ పొందుతుంది. స్టాండర్డ్ హురాకాన్ ఎవో మోడల్ కంటే 29 హార్స్ పవర్ తక్కువ.

ఆటోమొబిలి లంబోర్ఘిని ఎస్‌.పి.‌ఏ అనేది ఒక ఇటాలియన్ బ్రాండ్. ఇది లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారిదారి. ఈ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన ఆడి ద్వారా వోక్స్వ్యాగన్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది.లాంబోర్గిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి 5.2-లీటర్, వి10 బెల్టింగ్ 594 బిహెచ్‌పితో డబ్ల్యుడి వెర్షన్ కంటే తక్కువ పవర్ పొందుతుంది. స్టాండర్డ్ హురాకాన్ ఎవో మోడల్ కంటే 29 హార్స్ పవర్ తక్కువ.

also read మార్కెట్లోకి ఏథేర్ 450ఎక్స్ కొత్త స్కూటర్..ధర ఎంతంటే ?

మొదట జనవరిలో లాంబోర్గిని ఫస్ట్ హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడిని వెల్లడించింది. ఇప్పుడు కేవలం ఒక్క నెలలోనే కంపెనీ ఈ కారును ఇండియాలో లాంచ్ చేసింది.లాంబోర్గిని హురాకాన్ ఈవో ధర 3.22 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా).భారతదేశానికి వచ్చిన హురాకాన్ ఎవో నుండి మూడవ కారు ఇది. ఈ కంపెనీ ఇండియాలో ఉరుస్ ఎస్‌యూవీని లాంచ్ చేసినప్పటి నుండి ఈ బ్రాండ్‌పై కార్ ప్రియులకి ఆసక్తి పెరుగుతోంది.

కంపెనీ ఇప్పటికే ఇండియాలో హురాకాన్ ఎవో, హురాకాన్ ఎవో స్పైడర్‌ మోడల్ కార్లను విడుదల చేసింది. హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి 5.2-లీటర్, వి10 బెల్టింగ్ 594 బిహెచ్‌పితో ఎడబ్ల్యుడి వెర్షన్ కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. స్టాండర్డ్ హురాకాన్ ఎవో కంటే 29 హార్స్ పవర్ తక్కువ.

లాంబోర్గిని  హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడికి కొత్త ఫ్రంట్ స్ప్లిటర్, ఫిన్స్, కొత్త బ్యాక్ డిఫ్యూజర్‌తో సహా కొత్త లుక్కింగ్ మార్పులతో వస్తుంది.లాంబోర్గిని 2020  హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడిలో టు సిటింగ్స్ తో మాత్రమే వస్తుంది. కారుకి ఫ్రంట్ ఆక్సీల్, బ్యాక్ స్టీరింగ్ ఉండదు కాకపోతే పవర్ కట్ ఉంది.

also read భారత్ బెంజ్ నుంచి కొత్త బి‌ఎస్ 6 ట్రక్కులు & బస్సులు

అయినప్పటికీ, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు కొన్ని మార్పులను జోడించారు.2020 హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడికి ప్రత్యేకమైన కొత్త పి-టిసిఎస్ లేదా పెర్ఫార్మెన్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇందులో ఉంది.  పాత హురాకాన్ LP580-2 తో పోలిస్తే కొత్త హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి సుమారు 30 శాతం ఓవర్‌స్టీర్‌ ఉంది.

ఈ కారు మొత్తం బరువు 1389 కిలోలు, ఇది ఏడబ్ల్యుడి వెర్షన్ కంటే తేలికైనది. కేవలం 3.3 సెకన్లలో టాప్ స్పీడ్ ని  అందుకుంటుంది.

click me!