వాహన ఇన్సూరన్స్ రినివల్ చేస్తున్నారా అయితే జాగ్రత.. లేదంటే జరిమానే..
రెగ్యులేటరీ బాడీ విడుదల చేసిన సర్క్యులర్ లో 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ఎత్తి చూపింది. ఇన్సూరెన్స్ పాలసీని రిన్యూవల్ చేసే ఇన్సూరెన్స్ సంస్థలు వాలిడిటీ ఉన్న పియుసి సర్టిఫికేట్ ఉంటేనే తప్ప వాహనాన్ని ఇన్సూరెన్స్ చేయవద్దని కోరింది.
మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ రిన్యూవల్ చేసే సమయంలో వాహన యజమాని వాలిడిటీ ఉన్న పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్‌ను తప్పనిసరి ఉండలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) తెలిపింది.
రెగ్యులేటరీ బాడీ విడుదల చేసిన సర్క్యులర్ లో 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ఎత్తి చూపింది. ఇన్సూరెన్స్ పాలసీని రిన్యూవల్ చేసే ఇన్సూరెన్స్ సంస్థలు వాలిడిటీ ఉన్న పియుసి సర్టిఫికేట్ ఉంటేనే తప్ప వాహనాన్ని ఇన్సూరెన్స్ చేయవద్దని కోరింది.
సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించాలని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల సిఇఓలు, సిఎండిలందరినీ కోరుతూ ఐఆర్‌డిఎఐ సర్క్యులర్ పెట్టడం ఇది రెండోసారి. దీనికి ముందు కూడా రెగ్యులేటరీ బాడీ 2018 జూలైలో ఇలాంటి సర్క్యులర్‌ను జారీ చేసింది.
also read బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హార్లే-డేవిడ్సన్ ప్లాంట్ మూసివేత.. ? ...
పెరుగుతున్న వాహన కాలుష్యం దృష్ట్యా, ఢీల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రత్యేక దృష్టి సారించి సుప్రీంకోర్టు పేర్కొన్న చర్యను కఠినంగా పాటించేలా చూడాలని అన్ని బీమా సంస్థలను ఐఆర్‌డిఎఐ ప్రత్యేకంగా కోరింది.
గత సంవత్సరం విడుదలైన మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం పియుసి నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10,000 జరిమానా విధిస్తారు. అయితే, కొత్త మోటారు వాహనాల (సవరణ) చట్టం భారతదేశం అంతటా ఇంకా అమలు కాలేదు. భారతదేశం అంతటా అన్ని వాహనాలకు పియుసి ధృవపత్రాలు తప్పనిసరి ఉపయోగిస్తారు.
కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ వంటి వాహనాల నుండి వెలువడే కాలుష్యం స్థాయిని అధికారులు తనిఖీ చేస్తారు. వాహనం పియుసి పరీక్ష చేసిన తర్వాత వాహన యజమానికి ఒక ధృవీకరణ పత్రం అందిస్తారు, అది ఆరు నెలల వరకు వాలిడిటీ ఉంటుంది.