కియా సోనెట్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 25వేలు చెల్లిస్తే చాలు..

By Sandra Ashok Kumar  |  First Published Aug 20, 2020, 2:23 PM IST

ఆసక్తిగల కస్టమర్లు 25వేలు చెల్లించి సోనెట్‌ను కియా మోటార్స్ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన ఈ  కారు సెప్టెంబర్‌లో ఇండియాలో డెలివరీలు మొదలవుతాయి.


సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటర్స్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ ప్రీ-బుకింగ్‌లు ఆగస్టు 20 నుండి ప్రారంభం కానున్నాయని తెలిపింది. ఆసక్తిగల కస్టమర్లు 25వేలు చెల్లించి సోనెట్‌ను కియా మోటార్స్ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన ఈ  కారు సెప్టెంబర్‌లో ఇండియాలో డెలివరీలు మొదలవుతాయి. సంస్థ నుండి కియా సోనాట్ మొదటి ఫోర్ మీటర్ వాహనం. హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యువి 300, రాబోయే నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటిపై కియా సోనాట్ పోటీ పడుతుంది.

Latest Videos

కియా సెల్టోస్ లాగానే సోనెట్ కూడా రెండు వెరీఎంట్లలో వస్తుంది. ఒకటి జిటి లైన్, రెండవది టెక్ లైన్.


కియా సోనేట్ ఫీచర్స్
వెంటిలేటెడ్ సీట్లు, బోస్ సరౌండ్ ఆడియో సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 10.25-అంగుళాల హెచ్‌డి టచ్‌స్క్రీన్, వైరస్ ప్రొటెక్షన్ తో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, కూలింగ్ ఫంక్షన్ తో వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ వంటి క్లాస్-లీడింగ్ ఫీచర్లను సోనెట్ అందిస్తుందని కియా హామీ ఇచ్చింది.

also read వ్యాపారాల కోసం కొత్త ఎలక్ట్రిక్‌ వాహనం వచ్చేసింది.. అదిరిపోయే మైలేజ్ కూడా.. ...

కియా సెల్టోస్, కార్నివాల్ లాగానే కియా సోనెట్ లో సంస్థ యూ‌వి‌ఓ కనెక్ట్ టెక్నాలజీతో 57కి పైగా కనెక్టివిటీ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి, ఇందులో వాయిస్ అసిస్ట్, మ్యాప్‌ల కోసం ఓవర్-ది-ఎయిర్ అప్ డేట్స్ ఉన్నాయి.

కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూఖ్యూన్ షిమ్ మాట్లాడుతూ "కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో వినియోగదారులకు కియా సోనెట్  సరైన ఛాయిస్ గా నిలుస్తుంది.

స్టయిల్, క్వాలిటి, ఫీచర్స్, పనితీరు, టెక్నాలజి, సౌకర్యం, భద్రత అన్నీ ఒకే ప్యాకేజీలో అందిస్తుంది. కియా సోనెట్ సేల్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇండియాలో ప్రారంభిస్తుంది. ప్రీ-బుకింగ్స్ ప్రారంభించడంతో మా స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని హృదయపూర్వకంగా స్వీకరిస్తారని మేము విశ్వసిస్తున్నాము." అని అన్నారు.

కియా సోనెట్ నాలుగు ఇంజన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, ఐఎంటి లేదా ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.

కియా సోనెట్ కారు ధర 7 లక్షల నుండి 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుండొచ్చు. ఫేస్-1లో కియా సోనెట్ భారతదేశంలో ప్రత్యేకంగా తయారు చేయబడి, ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు ఎగుమతి చేయబడుతుందని కియా మోటర్స్ వెల్లడించింది, ఇది మేక్-ఇన్-ఇండియాలో ప్రపంచానికి ఒక అందమైన ఉదాహరణ.  
 

click me!