హ్యుందాయ్ కార్ల పై భారీ తగ్గింపు ఆఫర్లు...కొద్ది రోజులు మాత్రమే...

By Sandra Ashok KumarFirst Published Mar 21, 2020, 4:53 PM IST
Highlights

1 ఏప్రిల్ 2020 నుండి బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి  వస్తునందున వివిధ కార్ల తయారీదారులు, అలాగే కార్ డీలర్లు మార్చి నెల చివరిలోగా పాత బిఎస్ 4 వాహనాలపై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తున్నారు.

కార్ల ఉత్పత్తిదారి హ్యుందాయ్ ఇండియా బిఎస్ 4 వాహనాల స్టాక్‌లను క్లియర్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా హ్యుందాయ్ కంపెనీ కార్ల ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లను ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు 31 మార్చి 2020 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు  ఉంటుందని కంపెనీ తెలిపింది.

1 ఏప్రిల్ 2020 నుండి బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి  వస్తునందున వివిధ కార్ల తయారీదారులు, అలాగే కార్ డీలర్లు మార్చి నెల చివరిలోగా పాత బిఎస్ 4 వాహనాలపై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు 31 మార్చి 2020 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు ఉంటుందని తెలిపాయి.

మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే, కొంచెం డబ్బు కూడా ఆదా చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్లను ఉపయోగించుకోవాలి అని చెబుతున్నారు.

also read సిబ్బంది విధులకు రాకపోయినా, కార్ల ఉత్పత్తి నిలిపేస్తాం : టాటా మోటార్స్

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ ఎంట్రీ లెవల్ కారు అయిన హ్యుందాయ్ సాంట్రో కార్ల స్టాకును కూడా క్లియర్ చేయాలని చూస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు బిఎస్ 4 సాంట్రా చిన్న కారు పెట్రోల్ వెర్షన్‌ పై 55వేల వరకు ఆఫర్ పొందవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్‌పై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. గ్రాండ్ ఐ10 పెట్రోల్ వెర్షన్ పై 75వేల వరకు ప్రయోజనాలతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుంది, అయితే బిఎస్ 4 గ్రాండ్ ఐ10 నియోస్  డీజిల్ పై 55వేల వరకు ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చు.

హ్యుందాయ్ బిఎస్ 6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్లు, బిఎస్ 4 డీజిల్ యూనిట్‌తో గ్రాండ్ ఐ10 నియోస్‌ను కూడా  విడుదల చేసింది. అయితే, బిఎస్ 6 ఇంజిన్‌తో కూడిన డీజిల్ వేరియంట్‌ను తరువాత ప్రవేశపెట్టారు.

అదనంగా కస్టమర్లు హ్యుందాయ్ ఎక్సెంట్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సబ్-కాంపాక్ట్ సెడాన్ పై 95వేల  వరకు ప్రయోజనాలు  అందిస్తున్నారు.ఇది కాకుండా కొరియా కార్ల తయారీదారు వెర్నా, క్రెటా, టక్సన్, ఎలంట్రాపై ఆకర్షణీయమైన బెనెఫిట్స్ అందిస్తోంది.

also read డుకాటీ బైకుల పై కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్...

హ్యుందాయ్ వెర్నా 1.6L వేరియంట్‌కు 95వేలు (పెట్రోల్ & డీజిల్),  క్రెటా పై  1.15 లక్షల (పెట్రోల్ & డీజిల్) వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. టక్సన్, ఎలంట్రా రెండూ పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై 2.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తాయి.

హ్యుందాయ్ ఐ20 కారుపై అన్ని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో మార్చి నెలలో డిస్కౌంట్‌ తీసుకొస్తుంది.పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో ఎరా, మాగ్నా వేరియంట్లను 45,000 వరకు మరోవైపు, పెట్రోల్ లేదా డీజిల్‌తో కూడిన స్పోర్ట్జ్ వేరియంట్ ₹ 65,000 వరకు తగ్గింపు  ఉంది.

ముఖ్యంగా హ్యుందాయ్ ఇండియా లైనప్‌లో భారీ తగ్గింపులతో అందిస్తున్న కార్ల తయారీదారు మాత్రమే కాదు. మారుతి సుజుకి ఇండియా, టాటా మోటార్స్, హోండా ఇతర కార్ల తయారీదారులు గడువుకు ముందే బిఎస్ 4 వాహనాలను క్లియర్ చేయాలని చూస్తున్నారు.
 

click me!