సిబ్బంది విధులకు రాకపోయినా, కార్ల ఉత్పత్తి నిలిపేస్తాం : టాటా మోటార్స్

By Sandra Ashok KumarFirst Published Mar 21, 2020, 4:11 PM IST
Highlights

కరోనా వైరస్ ప్రభావం ఆటోమొబైల్ పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది. తాజాగా టాటా మోటార్స్ యాజమాన్యం కూడా పరిస్థితి విషమిస్తే ఉత్పత్తి నిలిపివేస్తామని టాటా మోటార్స్ ఎండీ గ్వెంటర్ బషెక్ తెలిపారు. సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా, ఉత్పత్తిని నిలిపివేసినా వేతనం చెల్లిస్తామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో తలెత్తిన విపరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ప్రముఖ దేశీయ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ తెలిపింది. ఇప్పటికే మహారాష్ట్రలోని ఉత్పాదక యూనిట్‌లో ప్రొడక్షన్ తగ్గించినట్లు సంస్థ ఎండీ గ్వెంటర్ బషెక్ ఓ ప్రకటనలో తెలిపారు. 

also read మారుతి సుజుకి నుండి లేటెస్ట్ మోడల్ స్విఫ్ట్ కార్...

‘దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావం ఇంకా తీవ్రమైతే మంగళవారం నుంచి ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని టాటా మోటార్స్ ఎండీ గ్వెంటర్ బషెక్ పేర్కొన్నారు. 

టాటా మోటార్స్ దేశంలోనే అతిపెద్ద వాహనాల తయారీ సంస్థ. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. టాటా మోటార్స్‌కు మహారాష్ట్రలోని పుణెలోని తయారీ కేంద్రం ఎంతో కీలకమైంది. కార్లు, ట్రక్కుల ఉత్పాదక కార్యక్రమాలు పుణె ప్లాంట్ నుంచే ఎక్కువగా సాగుతాయి. 

also read ఆడీ, వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ నిలిపివేత....

మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో ప్లాంట్ మూసివేత, ఇతర కారణాల వల్ల ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయినా వారికి మార్చి, ఏప్రిల్ నెలల్లో వేతనాలు చెల్లిస్తామిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇక బ్రిటన్ లోని టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ కూడా తమ కార్యకలాపాలను మూసివేయనున్నట్లు గురువారం వెల్లడించింది. వచ్చే వారం నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. 

click me!