గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి హ్యుందాయ్ కారు...

Ashok Kumar   | Asianet News
Published : Jan 18, 2020, 06:12 PM IST
గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి హ్యుందాయ్ కారు...

సారాంశం

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా ఎక్కువ ఎత్తుకు ఎక్కి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. హ్యుందాయ్  కోనా ఎలక్ట్రిక్ కారు టిబెట్‌లోని సావులా పాస్‌ లో 5,731 మీటర్ల ఎత్తుకు ఎక్కగలిగింది.

ఆటొమొబైల్ రంగంలో కార్ల ఉత్పత్తి తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీ ఒక కొత్త రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా ఎక్కువ ఎత్తుకు ఎక్కి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. హ్యుందాయ్  కోనా ఎలక్ట్రిక్ కారు టిబెట్‌లోని సావులా పాస్‌ లో 5,731 మీటర్ల ఎత్తుకు ఎక్కగలిగింది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు అత్యధిక ఎత్తుకి ఎక్కి గిన్నిస్ రికార్డుల్లోకి ప్రవేశించింది. ఇంతకు ముందు నియో ఇఎస్ 80  5,715.28 మీటర్ల ఎత్తు ఎక్కి రికార్డు సృష్టించగా ప్రస్తుతం ఆ రికార్డును హ్యుందాయ్  కోనా అధిగమించింది. టిబెట్‌ దేశంలోని సావులా పాస్‌ ప్రదేశంలో 5,731 మీటర్ల ఎత్తుకు నడిపిన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఇది.

also read యూత్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్... హై స్పీడ్, లేటెస్ట్ ఫీచర్లతో...

ఈ కారు  డ్రైవ్ మొత్తం వ్యవధిలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనానికి స్టాండర్డ్ పోర్టబుల్ ఛార్జర్‌ను ఉపయోగించి ఛార్జ్ చేయబడిందని కార్ల తయారీదారి చెప్పారు.ఎత్తైన ప్రదేశాలను అధిరోహించేటప్పుడు ఈ కారు పనితీరులో ఎలాంటి సమస్యలు లేవని హ్యుందాయ్ సంస్థ పేర్కొంది. అలాగే ఎత్తైన ప్రదేశాల నుండి కిందకి దిగేటప్పుడు కారులో స్మార్ట్ పవర్ పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఉపయోగపడుతుంది.


హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు సాధించిన విజయాలపై హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎం.డి & సిఇఒ ఎస్. ఎస్ కిమ్ మాట్లాడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఫీట్ కు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు తయారీ ప్రతి ఒక్కరికీ చాలా గర్వకారణం అని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల గురించి వివిధ అపోహలు ఉన్నవారికి  కోన ఎలక్ట్రిక్ కారు మంచి నమ్మకాన్ని తీసుకువచ్చింది.  


హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ తక్కువ ఉష్ణోగ్రతల ప్రదేశాలలో లేదా నిరంతర హిమపాతం, మంచుతో నిండిన టార్మాక్స్ వంటి తీవ్రమైన, కఠినమైన పరిస్థితులలో కూడా పని చేయగలదని నిరూపించడానికి ఇది ఒక పరీక్ష అని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో 39.2 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఇది 100-కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఇది 131 బిహెచ్‌పి, 395 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తిని అందిస్తుంది.

also read ఆన్‌లైన్‌ ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు... ఎలా అంటే...?


ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒకే ఛార్జీపై 452 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రెగ్యులర్ ఛార్జర్‌ను ఉపయోగించి ఏడు నుంచి ఎనిమిది గంటల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అయితే ఫాస్ట్ ఛార్జర్ ఒక గంటలోపు బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. కోనా ఎలక్ట్రిక్‌ కారుతో అందించే పోర్టబుల్ ఛార్జర్‌ను ఏదైనా 15amp ప్లగ్ పాయింట్‌తో ఉపయోగించూకొవచ్చు. అయితే ఫాస్ట్ ఛార్జర్‌ కోసం విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


కోనా ఎలక్ట్రిక్‌ కారుకి 7.2 కిలోవాట్ల ఎసి ఛార్జర్‌కు కూడా  పనిచేస్తుంది. ఇది అన్ని హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ సెల్లింగ్ డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో హ్యుందాయ్‌ ఫ్లీట్ కోనా ఎలక్ట్రిక్ ఉంది. ఇది పవర్ కన్వర్టర్‌తో అమర్చబడి ఎమర్జెన్సీ ఛార్జింగ్ కి  సపోర్ట్ చేస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి