హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....

By Sandra Ashok KumarFirst Published Feb 3, 2020, 1:16 PM IST
Highlights

చైనాలో హ్యుండాయ్ ఐఎక్స్25 మోడల్‌గా కారు ఆవిష్కరణ చేశారు. విపణిలో దీని ధర సుమారు రూ.10.6 లక్షల నుంచి రూ.13.7 లక్షల వరకు.. చైనా కరెన్సీలో 1,05,800 నుంచి 1,36,800 యువాన్లకు లభిస్తుందని అంచనా. తాజా మోడల్ క్రెటా (ఐఎక్స్ 25) 4000 యువాన్లకు తక్కువగా లభిస్తుంది. 

న్యూఢిల్లీ: ఈ నెల ఆరో తేదీ నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్ పో నేపథ్యంలో హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గురువారం బీఎస్-6 ప్రమాణాలతో కూడిన క్రెటా మోడల్ కారును ఆవిష్కరించనున్నది. హ్యుండాయ్ సిగ్నేచర్ కాస్కేడింగ్ గ్రిల్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ తదితర ఫీచర్లను ఈ కారులో జత చేసింది. 

చైనాలో హ్యుండాయ్ ఐఎక్స్25 మోడల్‌గా కారు ఆవిష్కరణ చేశారు. విపణిలో దీని ధర సుమారు రూ.10.6 లక్షల నుంచి రూ.13.7 లక్షల వరకు.. చైనా కరెన్సీలో 1,05,800 నుంచి 1,36,800 యువాన్లకు లభిస్తుందని అంచనా. తాజా మోడల్ క్రెటా (ఐఎక్స్ 25) 4000 యువాన్లకు తక్కువగా లభిస్తుంది. 

also read కోలుకోని ఆటోమొబైల్ రంగం... మారుతి మినహా అన్నీ డౌన్...

హ్యుండాయ్ క్రెట్టా (ఐఎక్స్ 25) తాజాగా ఆల్ న్యూ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కపుల్డ్ విత్ సీవీటీ (కంటిన్యూయస్లీ వారియబుల్ ట్రాన్సిమిషన్) సామర్థ్యం కలిగి ఉంటుంది. సీవీటీ మోడల్ ఇంజిన్ కారును మరింత ఎఫిసియెంట్‌గా ఉంచుతుంది. ప్రస్తుతం హ్యుండాయ్ క్రెట్టా మోడల్ 1.6 లీటర్లతోపాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నది. 

హ్యుండాయ్ క్రెట్టా స్పోర్ట్స్ కారు ఇన్ ఫ్రంట్‌లో బోల్డ్ గ్రిల్లె కలిగి ఉంటుంది. హ్యుండాయ్ ఐఎక్స్ 25 మోడల్ కారు హెడ్ ల్యాంప్ సెటప్ ‘హెడ్ ల్యాంప్’ను స్ప్లిట్ చేయడంతోపాటు ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ బోర్డర్స్‌తో ఏర్పాటైంది. డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ మూడు భాగాలుగా విడిపోతాయి.

also read ఇండియాలోకి లెక్సెస్‌ సూపర్‌ కార్లు... ప్రారంభపు ధర...

హ్యుండాయ్ ఐఎక్స్ 25 స్పోర్ట్స్ కారు ప్రస్తుత మోడల్ కారు మాదిరిగానే ఉంటుంది. స్ప్లిట్ టైప్ టెయిల్ ల్యాంప్స్‌ను కలిగి ఉన్న ఐఎక్స్25 కారు లోపల 10.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కలిగి ఉంటుంది. 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ దీని సొంతం. హ్యండాయ్ మోటార్స్ క్రెట్టా (ఐఎక్స్ 25) మోడల్ కారుతోపాటు విపణిలోకి టుస్కన్ మోడల్ కారును ఈ నెల ఐదో తేదీన విడుదల చేయనున్నది.

‘ఫ్రీడం ఇన్ ఫ్యూచర్ మొబిలిటీ’ థీమ్‌తో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 13 కార్లను, ఫ్యూచర్ రెడీ టెక్నాలజీతో ఎక్స్ పోలో ప్రదర్శించనున్నదని హ్యుండాయ్ మోటార్స్ ఎండీ కం సీఈఓ ఎస్ఎస్ కిమ్ తెలిపారు. కొనా ఎలక్ట్రిక్ మోటర్ కారుతోపాటు నెక్సో ఎఫ్సీఈవీ కార్లను ఈ నెల ఐదో తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఎక్స్ పోలో ప్రదర్శిస్తామని హ్యుండాయ్ మోటార్స్ ఎండీ కం సీఈఓ ఎస్ఎస్ కిమ్ తెలిపారు. 

click me!