ఇండియన్ మార్కెట్లోకి హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ వేర్షన్.. ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Jul 28, 2020, 10:49 PM IST

ముఖ్యంగా ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో తొలిసారిగా ఆవిష్కరించిన హ్యుందాయ్ టక్సన్  మూడవ తరం మోడల్  ఫేస్ లిఫ్ట్. టక్సన్ వాహనం భారతదేశంలో సంస్థ యొక్క ముఖ్యమైన  సమర్పణ. 


హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) 2020 హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీని భారతదేశంలో 22.3 లక్షల (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

ముఖ్యంగా ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో తొలిసారిగా ఆవిష్కరించిన హ్యుందాయ్ టక్సన్  మూడవ తరం మోడల్  ఫేస్ లిఫ్ట్. టక్సన్ వాహనం భారతదేశంలో సంస్థ యొక్క ముఖ్యమైన  సమర్పణ.

Latest Videos

దేశంలో 2016 నుండి ఇది మూడవ జనరేషన్. కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో టక్సన్ విదేశీ మార్కెట్‌లోని వాహనాలకు  సమానంగా కనిపిస్తుంది. కారుకి పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్, కొత్త ప్రొజెక్టర్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, అప్‌డేటెడ్ ఎల్ఇఎఫ్ టెయిల్ లాంప్స్, అప్‌డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌ తో వస్తుంది.

also read 

ఈ కారుకి కొత్తగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. వెనుక భాగంలో ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్, మెకానికల్స్ విషయానికొస్తే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ బి‌ఎస్-VI కంప్లైంట్ వెర్షన్‌, 152 పిఎస్ పవర్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ దీనికి ఉంది.

185 పిఎస్ పవర్, బిఎస్-v 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గేర్ తో వస్తుంది. లోపలి భాగంలో ఆల్-బ్లాక్ థీమ్ క్యాబిన్, బ్లూ లింక్ కనెక్టివిటీ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, కొత్త 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఇందులో అమర్చారు.

టక్సన్‌కు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, బ్లూటూత్, వాయిస్ రికగ్నిషన్ సపోర్ట్ లభిస్తుంది. భద్రత, లక్షణాలకు సంబంధించి 2020 హ్యుందాయ్ టక్సన్ లో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఈ‌ఎస్‌సి, వి‌ఎస్‌ఎంతో ట్రాక్షన్ కంట్రోల్, హిల్-అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవింగ్ మోడ్‌, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) తో రానుంది.
 

click me!