అద్భుతమైన ఫీచర్లతో హ్యుండాయ్ లేటెస్ట్ మోడల్ కార్....

By Sandra Ashok KumarFirst Published Jan 8, 2020, 12:44 PM IST
Highlights

అత్యాధునిక హ్యుండాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ త్వరలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో ప్రదర్శితం కానున్నది. మిడ్ ఎస్‌యూవీ కారుగా వినియోగదారులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ధర రూ. 18.7 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ముంబై: దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యూండాయ్‌ టక్సన్‌ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారును ఈ ఏడాది ఆటోఎక్స్‌పోలో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే దీనిని 2018 న్యూయార్క్‌ ఆటోషోలో ప్రదర్శించింది. త్వరలోనే హ్యూండాయ్‌ దీని ధరలను కూడా హ్యుండాయ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సియోన్ సియోబ్ కిమ్ ధ్రువీకరించారు.  

also read అవతార్ సినిమా స్ఫూర్తితో ‘బెంజ్’ కార్... జేమ్స్ కేమరూన్​ సాయంతో ఆవిష్కరణ...

లేటెస్ట్ డిజైనింగ్ రూపంగా ఉన్న హ్యుండాయ్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కారును లుక్స్‌లో కూడా హ్యూండాయ్‌ మార్పులు చేసింది. ట్రాపిజోయిడల్‌ గ్రిల్‌, షార్పర్‌ హెడ్‌లైట్స్‌, సరికొత్త టెయిల్‌ లైట్‌ క్లస్టర్‌ వంటి హంగులు ఉన్నాయి. మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారుగా రూపుదిద్దుకున్న ఈ కారు బీఎస్-6 ప్రమాణాలకనుగుణంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

ఇక కారులోపల ఇంటీరియర్‌లోనూ మార్పులు జరిగాయి. కారు సెంటర్‌ కన్సోల్‌ ఎనిమిదంగుళాల టచ్‌స్క్రీన్‌ను అమర్చారు. ఈ కారులో సరికొత్త ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ను అమర్చారు. దీంతోపాటు రెండో వరుసలోనూ యూఎస్బీ ఛార్జర్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌ను అమర్చారు.హ్యుండాయ్ ఇండియా రూపొందించిన టక్సన్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ కారులో 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

also read రికార్డు స్థాయిలో రోల్స్ రాయిస్ కార్ల అమ్మకాలు...

దీనిలో 2.0 లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లను అమర్చారు. ఈ ఇంజిన్‌ బీఎస్‌-6 ఉద్గర నిబంధనలను అనుసరించే రూపొందించారు. దీని ధర రూ.18.76లక్షల నుంచి మొదలు కావచ్చని భావిస్తున్నారు. వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.27లక్షల వరకు ఉండవచ్చు.బీఎస్-6 ప్రమాణాలు గల ఈ కారులో 2.0 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనున్నది హ్యుండాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్. 6-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది.

రేంజ్ టాపింగ్ డీజిల్ ఆటోమేటిక్ వర్షన్‌లో ఎడబ్ల్యూడీ ఆప్షన్ కూడా ఉండే చాన్స్ ఉంది. న్యూ 8.0 టచ్ స్క్రిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, బ్లూ లింక్ కనెక్టివిటీ, 360 డిగ్రీల కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
 

click me!