అమ్మకాల్లేక నీరసించిన ఆటోమొబైల్ రంగం..కానీ అక్కడ ఫుల్ డిమాండ్..

By Sandra Ashok Kumar  |  First Published Jun 2, 2020, 10:42 AM IST

ఇప్పటికీ వాహనాల విక్రయాలు రివర్స్‌గేర్‌లోనే ఉన్నాయి. లాక్‌డౌన్ తర్వాత మేలో సడలింపులివ్వడంతో కార్ల తయారీ సంస్థలు మారుతి విక్రయాల్లో 89% పడిపోగా, హ్యుండాయ్, మహీంద్ర సేల్స్‌లో 79% క్షీణత నమోదైంది. 
 


న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగం సేల్స్ రివర్స్‌గేర్‌లోనే పయనిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆటోమొబైల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మారుతీ సుజుకీ కార్ల విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. 2019 మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన మారుతి సుజుకి గతనెలలో 13,888 కార్లు మాత్రమే అమ్మగలిగింది.

ఏప్రిల్ నెలలో లాక్ డౌన్ వల్ల పూర్తిగా అమ్మకాల్లేక నీరసించిన ఆటోమొబైల్ రంగం.. గత నెలలో సేల్స్‌కు అనుమతించడంతో ఊపిరి పీల్చుకున్నది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనే సొంత వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్ల వల్ల పట్టణాలు, నగరాల పరిధిలో సేల్స్ మీద ఆంక్షల ప్రభావం పడిందన్నారు.

Latest Videos

గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తమ డీలర్లు నిల్వ ఉన్న కార్లలో కొంత మేరకు విక్రయించగలిగారని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనే సేల్స్ పెరిగాయన్నారు. వాటిలో పట్టణ ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్ల క్లస్టర్ ప్రాంతాలు ఉన్నాయన్నారు. 

మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ క్షీణతను నమోదు చేశాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోయాయి.

వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్‌ లేలాండ్‌ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగిన కారణంగా ఆ నెలలో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్‌ను ప్రకటించడం తెలిసిందే. మే నెలలో కొన్ని సడలింపులు ఇవ్వడం వల్లే వాహనాల విక్రయాలు కొంత మేరకు జరిగాయి. 

2019 మే నెలతో పోలిస్తే హ్యుండాయ్ మోటార్స్ కార్ల విక్రయాలు 59,102 యూనిట్ల నుంచి క్షీణించి 78.7 శాతానికి పతనం అయ్యాయి. అంటే కేవలం 12,583 కార్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. దేశీయ విక్రయాల్లో 83.8 శాతం క్షీణత రికార్డై 6,883 కార్ల అమ్మకాలు పడిపోయాయి. ఎగుమతుల్లో 16,600 నుంచి 5700 యూనిట్లు తగ్గిపోయాయి.

also read కరోనా సంక్షోభంలోనూ బైక్స్ కొనుగోళ్ల జోరు..గతేడాది కంటే కాస్త ఎక్కువే..

మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల విక్రయాలు 79 శాతం క్షీణించాయి. అంటే గతేడాది 45,521 కార్లను విక్రయించిన మహింద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది మే నెలలో 9,560 యూనిట్లు మాత్రమే విక్రయించింది. దేశీయంగా 43,056 కార్లు గతేడాది మే నెలలో అమ్మితే ఈ ఏడాది 70 శాతం క్షీణించాయి. అంటే కేవలం 9,076 కార్ల అమ్మకాలతో సరిపెట్టుకున్నది.

ఎంజీ మోటార్స్ గత నెలలో కేవలం 710 కార్లు మాత్రం విక్రయించింది. హోండా కార్స్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 96.72 శాతం తగ్గిపోయాయి. అంటే అతి తక్కువగా 324 కార్లు మాత్రమే అమ్ముకోగలిగింది. అయితే మమీంద్రా అండ్ మహీంద్రా టాక్టర్ల విక్రయాలు ఒక్కశాతం తగ్గాయి. గతేడాది మే నెలలో 24,704 ట్రాక్టర్లు విక్రయించిన మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 24,341 యూనిట్లతో సరిపెట్టుకున్నది. 

దేశీయంగా మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ పెరిగాయి. 2019 మే నెలలో 23.539 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. గత నెలలో మాత్రం 24,017 ట్రాక్టర్లను విక్రయించగలిగింది. ఎగుమతులు 72 శాతం పడిపోయాయి. 1,165 నుంచి 324 ట్రాక్టర్లు మాత్రమే మహీంద్రా విదేశాలకు ఎగుమతి చేసింది. ఎస్కార్ట్ ట్రాక్టర్ల విక్రయాలు 6,827 యూనిట్ల నుంచి 6594 యూనిట్లకు పరిమితం అయ్యాయి. 

రాయల్ ఎన్ ఫీల్డ్ మోటారు సైకిళ్ల విక్రయాలు 69 శాతం పడిపోయాయి. గతేడాది 62,371 యూనిట్లు విక్రయించిన రాయల్ ఎన్ ఫీల్డ్.. ఈ ఏడాది 19,113 యూనిట్లతో సరిపెట్టుకున్నది. దేశీయంగా 60,211 నుంచి 68 శాతం తగ్గి 684 యూనిట్లకు తగ్గిపోయాయి. టీవీఎస్ మోటార్స్ గత నెలలో 56,218 యూనిట్లు విక్రయించగా, హీరో మోటో కార్ప్స్ సేల్స్ 82.71 శాతం తగ్గి1,12,682కు పరిమితం అయ్యాయి.

అశోక్ లేలాండ్స్ వాణిజ్య వాహనాల విక్రయాలు 13,172 నుంచి 68 శాతం తగ్గాయి. అంటే కేవలం 1420 వాహనాలే అమ్ముడయ్యాయి. దేశీయంగా 90 శాతం వాహనాల విక్రయం పడిపోయింది. దీంతో గతేడాది 12,778 యూనిట్లు విక్రయించి అశోక్ లేలాండ్ 1,277 యూనిట్లు విక్రయించింది. మధ్య భారీ ట్రక్కుల అమ్మకాలు 98 శాతం పడిపోయి 151తో సరిపెట్టుకున్నాయి. 
 

click me!