ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాల విక్రయానికి కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నాయి. టాటా మోటార్స్ తన కస్టమర్లకు ప్రత్యేకించి కరోనా విశ్వమారిపై పోరాడుతున్న సిబ్బంది కోసం పలు ‘కీస్ టు సేఫ్టీ’ అనే ఆఫర్లు అందించింది. ఇంతకుముందు మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా ఇటువంటి పథకాలే తీసుకొచ్చాయి.
హైదరాబాద్ : కరోనా వేళ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ ‘కీస్ టు సేఫ్టీ’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. కరోనాపై పోరాడుతున్న పోరాట యోధులకు ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ సమగ్ర ప్యాకేజీ కింద కంపెనీ కార్లు, ఎస్‌యూవీలు కొనుగోలు చేసే వారికి 5 నుంచి 8 ఏళ్లలో చెల్లించేలా టాటా మోటార్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణ సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని మాలిక్ కార్స్, ఆరెంజ్ ఆటో, తేజస్వి మోటార్స్, వెంకటరమణ మోటార్స్, సెలక్ట్ కార్స్, విశాఖపట్నంలోని శివశంకర్ మోటార్స్ డీలర్ల దగ్గర ఈ ప్యాకేజీ లభిస్తుంది.
undefined
ఇంకా ఈ ఆఫర్ కింద కరోనాపై పోరులో ముందు ఉన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఇతర అత్యవసర సేవల సిబ్బందికి.. రూ.45వేల వరకు టాటా మోటార్స్ విలువైన ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. అయితే ఆల్ర్టోజ్ వెహికల్స్‌పై మాత్రం ఈ ప్రయోజనం లభించదు.
కీస్ టు సేఫ్టీ ప్యాకేజీ కింద టాటా టియాగో కారు కొనేందుకు, ఐదేళ్లలో చెల్లించేలా రూ.5 లక్షల కారు లోన్ లభిస్తుంది. దీనిపై ఆరు నెలల వరకు నెలకు రూ.5,000 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మాత్రం ఈఎంఐ పెరుగుతుంది. ఈ లోన్ చెల్లింపుల్లోనూ టాటా మోటార్స్ తన కొనుగోలుదారులకు మూడు ఆప్షన్లు ఇస్తోంది.
also read జూన్ 30 వరకు ‘మారుతి‘ ఉచిత సర్వీసు: 5000 కార్ల ఎగుమతి.. హ్యుండాయ్
ఇందులో బుల్లెట్ ఈఎంఐ అనే ఆప్షన్ కింద ఐదో సంవత్సరం చెల్లించాల్సిన రూ.90,000 ఈఎంఐని ఒకేసారి ముందుగా చెల్లించి కారు ఓనర్ షిప్ సొంతం చేసుకోవచ్చు. ఒక వేళ ఆర్థిక సమస్యలతో ఈఎంఐ చెల్లింపుల్లో సమస్యలు ఎదురైతే కారును టాటా మోటార్స్ ఫైనాన్స్ కంపెనీకి రిటర్న్ చేయవచ్చు. లేదా తుది ఈఎంఐ చెల్లింపులనూ రీఫైనాన్స్ చేసుకోవచ్చు.
టాటా మోటార్స్ మాదిరిగానే ఇంతకుముందు మహీంద్రా అండ్ మహీంద్రా తన వినియోగదారులు.. ప్రత్యేకించి కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసులకు ’బై నౌ.. పే లేటర్’ అనే స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా ఇదే స్కీమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
టయోటా విక్రయాల్లో 86 క్షీణత
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) తమ దేశీయ విక్రయాలు మే నెలలో 86.49 శాతం క్షీణించినట్లు తెలిపింది. గత నెలలో 1,649 యూనిట్లు మాత్రమే విక్రయించినట్లు టయోటా వెల్లడించింది. 2019 మే నెలలో 12,138 వాహనాలు విక్రయించామని వివరించింది.