బీఎండబ్ల్యూ ‘టురిస్మో’ స్పెషల్: 7.9 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్!

By rajesh y  |  First Published Apr 11, 2019, 11:54 AM IST

జర్మనీ లగ్గరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త కారును దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 6 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన డీజిల్ రకం గ్రాన్ టురిస్మో సెడాన్ ధరను రూ.63.9 లక్షలుగా నిర్ణయించింది. 


న్యూఢిల్లీ: జర్మనీ లగ్గరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త కారును దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 6 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన డీజిల్ రకం గ్రాన్ టురిస్మో సెడాన్ ధరను రూ.63.9 లక్షలుగా నిర్ణయించింది. 

చెన్నైలో ఉన్న ప్లాంట్‌లో ఈ కారును తయారు చేసినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది. ఈ నూతన కారుతో డీజిల్ మోడళ్ల పరిధిని మరింత విస్తరించడానికి దోహదం చేయనున్నదని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ హ్యాన్స్-క్రిస్టియన్ తెలిపారు. 

Latest Videos

ఈ విభాగంలో బీఎండబ్ల్యూ ఇప్పటికే రెండు డీజిల్ మోడళ్లు, ఒక పెట్రోల్ మోడల్‌ కార్లను విక్రయిస్తున్నది. రెండు లీటర్లు, 4 సిలిండర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.9 సెకన్లలో అందుకోనున్నదని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ హ్యాన్స్-క్రిస్టియన్ వెల్లడించారు. 

ఎంట్రీ లెవల్ డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారుతో ఈ సెగ్మెంట్ మరింత బలోపేతం కానున్నదన్నారు. ‘బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ గ్రాన్‌ టురిస్మో విడుదలతో భారత్‌ లగ్జరీ మార్కెట్‌లో కొత్త విభాగాన్ని సృష్టించాం’అని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా అధ్యక్షుడు హాన్స్‌-క్రిస్టియన్‌ బెర్టెల్స్‌ తెలిపారు.  

ఐదు శాతం తగ్గిన టాటా మోటార్స్ సేల్స్

టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాలు ఐదు శాతం తగ్గాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వాహనాలతో కలిపి మార్చిలో మొత్తం 1,45,459 వాహనాలను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో 1,53,156 వాహనాలను విక్రయించింది. ప్రయాణికుల వాహన విభాగంలో అంతర్జాతీయ విక్రయాలు 96,757 నుంచి తొమ్మిది శాతం తగ్గి 88,296కు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో వాణిజ్య వాహన విక్రయాలు మాత్రం 56,399 నుంచి 1 శాతం పెరిగి 57,163కు చేరాయి. జేఎల్‌ఆర్‌ విక్రయాలు కూడా 76,221 నుంచి 8 శాతం తగ్గి 70,171 వాహనాలకు పరిమితమయ్యాయి.

click me!