ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు షాకిచ్చిన టాటా మోటార్స్‌.. గత 4 ఏళ్లలో ఇది 3వ సారి..

By S Ashok KumarFirst Published Dec 12, 2020, 3:35 PM IST
Highlights

టాటా మోటార్స్ సంస్థలో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్నవారు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వి‌ఆర్‌ఎస్ పథకం కింద ఉద్యోగి వయస్సు, సంస్థలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో బట్టి పరిహారం అందించనున్నారు. 

భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ టర్నరౌండ్ వ్యూహంలో భాగంగా తన 42,597 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) అందించింది. ఒక అంచనా ప్రకారం మొత్తం ఉద్యోగులలో సగం మందికి  పైగా  ఈ వీఆర్ఎస్ పథకానికి అర్హులు. నాలుగేళ్లలో మూడోసారి  వీఆర్‌ఎస్ పథకాన్ని టాటా మోటార్స్‌ ప్రకటించడం గమనార్హం.

టాటా మోటార్స్ సంస్థలో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్నవారు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వి‌ఆర్‌ఎస్ పథకం కింద ఉద్యోగి వయస్సు, సంస్థలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో బట్టి పరిహారం అందించనున్నారు. 

ఉద్యోగుల సంక్షేమం పట్ల నిబద్ధతను నిర్ధారిస్తూ కంపెనీ టర్నరౌండ్ ప్రణాళికను అమలు చేస్తోందని,  అర్హతగల ఉద్యోగులు మరియు కార్మికులు డిసెంబర్ 11 నుండి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు.

also read ఇండియన్ మార్కెట్లోకి కవాసాకి నింజా300 బిఎస్ 6 బైక్.. ధర, ఫీచర్స్ ఇవే.. ...

అంతకుముందు 2019 నవంబర్‌లో ప్రయాణీకులతో పాటు వాణిజ్య వాహన వ్యాపారాలలో ఉన్న వివిధ విభాగాలలోని 1,600 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ను అందించింది.

టాటా మోటార్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించడానికి వి‌ఆర్‌ఎస్ పథకం అందిస్తుంది. 2017లో కూడా ఇదే విధమైన వి‌ఆర్‌ఎస్ పథకం అందించగ, చాలా మంది ఉద్యోగులు  సంస్థతో విడదీసే ప్యాకేజీని పొందకూడదని నిర్ణయించుకున్నారు.

2019 నుండి ఆటో పరిశ్రమలో మందగమనం మధ్య, ఇతర ఆటో మేజర్లైన హీరో మోటోకార్ప్ లిమిటెడ్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఇలాంటి పథకాలను అమలు చేశాయి.

 కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో తక్కువ డిమాండ్‌తో 2020 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 314.5 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ నివేదించింది. అంతకుముందు ఏడాదిలో కంపెనీ రూ .216.56 కోట్ల నష్టాన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.8,437.99 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
 

click me!