ఆటో ఎక్స్ పోలో రెనాల్డ్ డస్టర్ సరికొత్త వెర్షన్‌

By Sandra Ashok KumarFirst Published Feb 10, 2020, 11:54 AM IST
Highlights

ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఫ్రాన్స్ ఆటో మేజర్ రెనాల్డ్.. తన నూతన మోడల్ డస్టర్ కారును ఆవిష్కరించింది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఆవిష్కరణ కానున్నది.

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రేనాల్ట్‌ సంస్థ తాజాగా బీఎస్-6 ప్రమాణాలతో సరికొత్త డస్టర్‌ను ఆటో ఎక్స్‌పో2020లో ప్రదర్శించింది. ఇది 1.0, 1.3 టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. డస్టర్‌ సరికొత్త వెర్షన్‌లో పలు మార్పులు చేసింది.

కొత్త  ఇంజిన్‌లో మొత్తం నాలుగు సిలిండర్లు ఉంటాయి. ఇది 153 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేయడంతోపాటు 250 ఎన్‌ఎం టార్క్‌ను కూడా విడుదల చేస్తుంది. 

also read మారుతి సుజుకి నుండి కొత్త జిమ్నీని మీరు చూశారా...?

దీనిలో 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తోపాటు సీవీటీ ఆటో ట్రాన్స్‌మిషన్‌ను ఆప్షన్‌గా అందజేశారు. 1.5 పెట్రోల్‌ ఇంజన్‌ను పక్కకు తప్పిస్తున్నట్లు రేనాల్ట్‌ వెల్లడించింది. చూడటానికి మాత్రం పాత డస్టర్‌తో కొత్త డస్టర్‌కు పెద్దగా భేదాలు లేవు. 

కొత్త ప్రొజెక్టర్‌ ల్యాంప్స్‌, గ్రిల్లో చిన్న మార్పులు చేశారు. బంపర్‌లో స్వల్ప మార్పులతోపాటు 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ను అమర్చారు. కాకపోతే ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయమై రెనాల్డ్  ఎటువంటి ప్రకటన చేయలేదు.

also read ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే !

ఇది 2020 రెండో త్రైమాసికంలో వచ్చే ఆగస్టు నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజారెనాల్డ్ డస్టర్ హెచ్బీసీ సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కానున్నది. 

సబ్-4ఎం ఎస్‌యూవీ మోడల్ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి మారుతి సుజుకి బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, న్యూ టర్బో చార్జుడ్ పెట్రోల్ ఇంజిన్ గల హ్యుండాయ్ వెన్యూ మోడల్ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. కియా మోటార్స్ వారి సెల్టోస్, ఇటీవల హ్యుండాయ్ ఆవిష్కరించిన క్రెటా మోడల్ కార్లను ఢీ కొడుతుందని అంచనా.  
 

click me!