సున్నీ లియోన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ తెలిపారు. కొత్త మసెరటి గిబ్లి కారు కొనడానికి ముందు, సన్నీ లియోన్ తన గ్యారేజీలో మసెరటి కంపెనీకి చెందిన క్వాట్రోపోర్ట్‌ను, 2017 లిమిటెడ్ ఎడిషన్ మాసెరటి గిబ్లి నెరిసిమోను కూడా కొనుగోలు చేసింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ క్వీన్ సన్నీ లియోన్ కి ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ మసెరటి కార్లు అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే కార్ల తయారీ కంపెనీ నుండి ఆమె మూడవ కారు కొత్త మసెరటి ఘిబ్లిని కొన్నారు. సున్నీ లియోన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ తెలిపారు.
కొత్త మసెరటి గిబ్లి కారు కొనడానికి ముందు, సన్నీ లియోన్ తన గ్యారేజీలో మసెరటి కంపెనీకి చెందిన క్వాట్రోపోర్ట్‌ను, 2017 లిమిటెడ్ ఎడిషన్ మాసెరటి గిబ్లి నెరిసిమోను కూడా కొనుగోలు చేసింది. కొత్త ఘిబ్లి కారును యుఎస్‌లోని లాస్ ఏంజిల్స్ లో నివసిస్తున్న ఆమె కుటుంబానికి కంపెనీ డెలివరీ చేసింది.
undefined
అయితే కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ విధించినప్పటి నుండి సున్నీ లియోన్ కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. మసెరటి ఘిబ్లి కారు కంపెనీ ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ సెడాన్ కారు. ఇటాలియన్ కంపెనీ ఈ కారును చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు.
also read లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 832 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ...
మసెరటి ఘిబ్లి కారు ఫీచర్స్
3.0-లీటర్ ట్విన్-టర్బో వి6 2979 ఇంజన్, 345 బిహెచ్‌పి 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ అభివృద్ధి చేస్తుంది. కేవలం 5.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 267 కిలోమీటర్లు. పెట్రోల్ అండ్ డీజిల్ వేరిఎంట్లలో లభిస్తుంది.
రెండింటిలో కూడా ఆటోమేటిక్ గేర్ స్టాండర్స్ గా వస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 16కేఎం. చైల్డ్ సేఫ్టీ లాక్ , కీ లేకుండా ఎంట్రీ, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ బ్రేకింగ్, వెనుక పార్కింగ్ సెన్సార్ ఇంకా కెమెరా, బ్లూ టూత్ ఇంకా చాల ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి.
సన్నీ లియోన్ ఆమె భర్త డేనియల్ వెబెర్ ఇద్దరికీ మంచి అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంది. మసెరటి కంపెనీ మూడు కార్లను యు.ఎస్‌లోనే కొనుగోలు చేశారు. మసెరటి ఘిబ్లి నెరిస్సిమో ప్రపంచవ్యాప్తంగా కేవలం 450 యూనిట్లు మాత్రమే ఉన్నాయి.
భారతదేశంలో ఈ కారు ధర రూ.1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). క్వాట్రోపోర్ట్ కారు మసెరటి బ్రాండ్ ముఖ్యమైన సెడాన్ కారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లగ్జరీ ఎస్‌యూవీ కార్లకు బదులు సన్నీ లియోన్ ఘిబ్లి కారును ఎంచుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే చాలా మంది సెలిబ్రిటీలు ఇతర టాప్ బ్రాండ్ కార్లను ఇష్టపడుతుంటరు. భారతదేశంలో దర్శకుడు రోహిత్ శెట్టి కూడా మసెరటి ఘిబ్లి కారు ఉంది. హీరో అర్జున్ కపూర్ కి మసెరటి లెవాంటే కారు ఉంది.