కలిసొచ్చిన లాక్‌డౌన్‌ సడలింపు.. ఊపందుకున్న వాహనాల విక్రయాలు : సియామ్‌

By Sandra Ashok Kumar  |  First Published Sep 12, 2020, 12:53 PM IST

ఇండియాలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఆగస్టులో 14.16 శాతం పెరిగి 2,15,916 యూనిట్లకు చేరుకున్నాయని పరిశ్రమల సంస్థ సియామ్ శుక్రవారం తెలిపింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 3 శాతం పెరిగి 15,59,665 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 15,14,196 యూనిట్లు విక్రయించాయి. 


వరుసగా తొమ్మిది నెలల క్షీణత తరువాత ఆగస్టులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు వృద్ధిని సాధించాయి. ఇండియాలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఆగస్టులో 14.16 శాతం పెరిగి 2,15,916 యూనిట్లకు చేరుకున్నాయని పరిశ్రమల సంస్థ సియామ్ శుక్రవారం తెలిపింది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐ‌ఏ‌ఎం) తాజా డేటా ప్రకారం, గత ఏడాది ఇదే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,89,129 యూనిట్లు. గత నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 1,24,715 యూనిట్లతో 14.13 శాతం పెరిగాయి.

Latest Videos

అదేవిధంగా యుటిలిటీ వాహనాల అమ్మకాలు  15.54 శాతం పెరిగి గత నెలలో విక్రయించిన 70,837 యూనిట్ల నుండి ఇప్పుడు 81,842 యూనిట్లకు చేరుకున్నాయి. 2019 ఆగస్టులో విక్రయించిన వ్యాన్ల అమ్మకాలు 9,015 యూనిట్లతో పోలిస్తే ఇప్పుడు 9,359 యూనిట్లకు పెరిగి 3.82 శాతం వృద్దిని సాధించాయని సియామ్ తెలిపింది.

also read 

అదేవిధంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 3 శాతం పెరిగి 15,59,665 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 15,14,196 యూనిట్లు విక్రయించాయి. మోటారుసైకిల్ అమ్మకాలు 10,32,476 యూనిట్లుగా ఉండగా, 2019 ఆగస్టులో 9,37,486 యూనిట్లు విక్రయించాయి అంటే 10.13 శాతం పెరిగింది.

స్కూటర్ అమ్మకాలు 12.3 శాతం తగ్గి 4,56,848 వద్ద ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 5,20,898 యూనిట్లు అమ్మకాలు నమోదయ్యాయి. "ఆటోమొబైల్ పరిశ్రమలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ప్రయాణీకుల వాహనాలు తిరిగి వృద్ధిని నమోదు చేయడం మేము గమనించాము" అని సియామ్ అధ్యక్షుడు కెనిచి ఆయుకావా చెప్పారు.

అయితే, గత నెలలో ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్ర వాహన విభాగాలలో సాధించిన వృద్ధి 2019 ఆగస్టుతో పోల్చితే తక్కువ స్థాయిలో ఉందని ఆయన అన్నారు.

"2019 ఆగస్టులో ప్రయాణీకుల వాహనాలు 32 శాతం, ద్విచక్ర వాహనాలు 22 శాతం వృద్ధిని చూపించాయి, ఎందుకంటే 2018 ఆగస్టులో బేస్ గణాంకాలు చాలా తక్కువగా ఉన్నాయని " అని ఆయుకావా అన్నారు. రాబోయే పండుగ సీజన్లో ఆటొమొబైల్ పరిశ్రమ వేగంగా పునరుద్ధరించడానికి, పరిశ్రమ సానుకూలంగా ఉందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు.
 

click me!