ssc gd result 2025: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల.. ఇలా ఇక్కడ చేక్ చేసుకోండి

Published : Jun 17, 2025, 09:18 PM IST
ssc gd

సారాంశం

ssc gd result 2025: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ (SSC GD Constable Result) ఫలితాలు విడుదలయ్యాయి. 3.91 లక్షల మంది అర్హులయ్యారు. ఇప్పుడు వీరంతా పీఈటీ, పీఎస్టీ పరీక్షల కోసం సిద్ధంగా ఉండాలి.

ssc gd result 2025: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ పరీక్ష 2025 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission-SSC) అధికారికంగా విడుదల చేసింది. దాదాపు 3.5 నెలల నిరీక్షణ తర్వాత ఈ ఫలితాలు మంగళవారం (జూన్ 17, 2025న) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఫలితాల పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో తమ రోల్ నంబర్ ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.

SSC GD Constable Result: అర్హత పొందిన అభ్యర్థులకు PET, PST పరీక్షలు

ఈసారి కంప్యూటర్ బేస్డ్ పరీక్షల (CBT) ద్వారా జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సీబీటీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇప్పుడు తదుపరి దశ అయిన పీఈటీ (Physical Efficiency Test), పీఎస్టీ (Physical Standard Test) కోసం హాజరవ్వాల్సి ఉంటుంది.

ఈ పరీక్షలు పురుషులు, మహిళలు ఇద్దరికీ ఉంటాయి. పీఈటీ, పీఎస్టీ నిర్వహణ బాధ్యత సీఆర్పీఎఫ్ (Central Reserve Police Force) కు అప్పగించారు.

SSC GD Constable పరీక్షకు హాజరైన వారిలో ఎంత మంది ఉత్తీర్ణులయ్యారు?

ఈ ఏడాది జరిగిన ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ సీబీటీ పరీక్షకు మొత్తం 25,21,839 అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 3.51 లక్షల మంది పురుష అభ్యర్థులు, సుమారు 40,000 మంది మహిళా అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3.91 లక్షల మంది అభ్యర్థులు ఇప్పుడు పీఈటీ, పీఎస్టీ దశలకు అర్హత సాధించారు.

ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ ఫలితాలు ఎలా చూసుకోవాలి?

1. ssc.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి

2. హోమ్‌పేజ్‌లో "Result" విభాగాన్ని క్లిక్ చేయండి

3. "GD Constable Result 2025" అనే లింక్‌ను ఎంచుకోండి

4. ఓ కొత్త విండోలో PDF ఓపెన్ అవుతుంది

5. అందులో మీ రోల్ నంబర్ ఆధారంగా ఫలితాన్ని చేక్ చేసుకోవచ్చు

6. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌ తీసుకోండి

ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ ఖాళీల వివరాలు

ఈసారి మొత్తం 53,690 ఖాళీలకు ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ పరీక్షలు నిర్వహించారు. విభాగాల వారీగా ఖాళీలు గమనిస్తే.. బీఎస్ఎఫ్ లో 16371, సీఐఎస్ఎఫ్ (CISF) 16571, సీఆర్పీఎఫ్ 14359, ఎస్ఎస్బీ 902, ఐటీబీపీ 3468, అస్సాం రైఫిల్స్ 1865, ఎస్ఎస్ఎఫ్ 132, ఎన్సీబీ 22 పోస్టులు ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Jobs : యువతకు లైఫ్ సెటిల్ చేసుకునే ఛాన్స్... నెలానెలా రూ.93,960 శాలరీతో వైట్ కాలర్ జాబ్స్
UPSC Interview Questions : మొబైల్, సెల్ ఫోన్ కి తేడా ఏమిటి..?