ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని బాధపడుతున్నారా..? భవిష్యత్తు మార్చే హైటెక్ కోర్స్ మీ కోసమే!

Published : Jul 24, 2026, 02:39 PM IST
Agriculture

సారాంశం

ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే గొప్ప చదువు… కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. సాప్ట్ వేర్ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితుల్లో నేటి యువత ఇతర కోర్సులపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో మంచి డిమాండ్ ఉన్న కోర్సుల గురించి తెలుసుకుందాం.

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని బాధపడుతున్నారా? లేదా వచ్చినా.. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం ఉంటుందా అనే ఆందోళన వేధిస్తోందా? అయితే ఇక పాత ఆలోచనలకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది. రేపటి వ్యవసాయాన్ని డ్రోన్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ నడిపించబోతున్నాయి. ఈ విప్లవంలో భాగం కావాలనుకునే విద్యార్థుల కోసం దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన B.Sc Agritech (Hons.) కోర్స్ ఇప్పుడు కెరీర్‌కు సరికొత్త దారులు తెరుస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండానే ఈ కోర్సులో చేరే అవకాశం ఉండటం విశేషం.

వ్యవసాయం కాదు... ఇది టెక్నాలజీతో నడిచే భవిష్యత్ పరిశ్రమ!

ఒకప్పుడు రైతు పొలంలో నాగలి పట్టేవాడు. ఇప్పుడు అదే రైతు చేతిలో డ్రోన్ రిమోట్ కనిపిస్తోంది. నేలలోని తేమను సెన్సార్లు కొలుస్తున్నాయి. AI పంటలకు వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తిస్తోంది. ఎప్పుడు విత్తనం వేయాలి? ఎంత నీరు ఇవ్వాలి? ఏ మందు వేయాలి? అన్నీ టెక్నాలజీయే నిర్ణయించే రోజులు వచ్చేశాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అగ్రి-టెక్ నిపుణులకు భారీ డిమాండ్ పెరుగుతోంది.

సౌత్ ఇండియాలోనే తొలి హైటెక్ అగ్రి కోర్స్

ఈ మారుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ వ్యవసాయ విద్యకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ B.Sc Agriculture, B.Sc Agritech (Hons.) వంటి ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా B.Sc Agritech (Hons.) కోర్సు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి రావడం విశేషం. భవిష్యత్ వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు అత్యాధునిక నైపుణ్యాలను అందిస్తోంది.

డ్రోన్‌లు... AI... రోబోటిక్స్... అన్నీ ఒకే కోర్సులో!

ఈ కోర్సులో వ్యవసాయ శాస్త్రంతో పాటు వెబ్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ అప్లికేషన్ల రూపకల్పన, డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్మార్ట్ ఫార్మింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి భవిష్యత్ టెక్నాలజీలను బోధిస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలపై కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో విద్యార్థులు రేపటి అగ్రి-టెక్ నిపుణులుగా ఎదిగే అవకాశం పొందుతారు.

క్యాంపస్‌లోనే డ్రోన్ ట్రైనింగ్... పరిశ్రమలకు అనుసంధానమైన శిక్షణ

ఈ కోర్సులో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన శిక్షణతో పాటు DGCA ఆమోదిత డ్రోన్ ట్రైనింగ్ కూడా క్యాంపస్‌లోనే అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఈ సర్టిఫికేషన్ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం డ్రోన్ ఆపరేటర్లకు ప్రముఖ వ్యవసాయ సంస్థల్లో నెలకు రూ.45 వేల వరకు వేతనాలతో అవకాశాలు లభిస్తున్నాయి.

చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్

వర్మీ కంపోస్టింగ్ సర్టిఫికేషన్, ఆధునిక వ్యవసాయ ల్యాబ్‌లు, పరిశ్రమల అనుసంధానంతో కూడిన ప్రాక్టికల్ ట్రైనింగ్, హైటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. చదువుతున్నప్పుడే పరిశ్రమ అనుభవం పొందేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు ఉద్యోగాలకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్‌ను ముందుగానే సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

ఉద్యోగాల భవిష్యత్తు... అగ్రి-టెక్‌లోనే!

వ్యవసాయం ఇప్పుడు పొలం వరకే పరిమితం కాదు. అగ్రి-టెక్ కంపెనీలు, డ్రోన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, అగ్రి స్టార్టప్‌లలో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. రేపటి వ్యవసాయాన్ని నడిపేది టెక్నాలజీయే. ఆ భవిష్యత్తులో మీ పిల్లలు కూడా భాగం కావాలంటే ఇప్పటి నుంచే సరైన కోర్సును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం.

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండానే మీ పిల్లల ఆసక్తి, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా ఏ కోర్సు ఉత్తమమో తెలుసుకోవాలనుకుంటే College Mentor నిపుణులను సంప్రదించండి. విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి స్థాయి కెరీర్ గైడెన్స్, కోర్సుల ఎంపిక, అడ్మిషన్ ప్రక్రియపై సమగ్ర సమాచారం అందిస్తున్నారు.

మరిన్ని వివరాల కోసం వెంటనే 92814 16210 నంబర్‌ను సంప్రదించండి. సరైన మార్గదర్శకంతో మీ పిల్లల భవిష్యత్తుకు ఈరోజే బలమైన పునాది వేయండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Free IAS IPS Coaching : ఖర్చులకు నెలనెలా డబ్బులిచ్చిమరీ ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. మీ కలెక్టర్ కలను నిజం చేసుకొండి
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే