విస్తరణ దిశగా జొమాటో.. భాగ్యనగరిలోనూ గోడౌన్

By telugu teamFirst Published Apr 30, 2019, 11:40 AM IST
Highlights

దేశమంతటా సేవల విస్తరణకు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది చివరికల్లా హైదరాబాద్ నగరంతోపాటు 20 వేర్ హౌస్‌ల నిర్మాణానికి రూ.56 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు జొమాటో సీఓఓ గౌరవ్ గుప్తా తెలిపారు.

ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలు డెలివరీ చేసే సంస్థ ‘జొమాటో’ వచ్చే ఏడాది (2020) చివరినాటికి దేశవ్యాప్తంగా మరో 20 గోదాములను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బీ2బీ ప్లాట్‌ఫామ్, హైపర్‌ప్యూర్ సేవల పరిధిని మరింత విస్తరించాలని జొమాటో యాజమాన్యం నిర్ణయించింది. 

ఇందులో భాగంగా 2020 చివరినాటికి హైదరాబాద్‌తోపాటు మరో 19 నగరాల్లో ఏర్పాటు చేయనున్న గోదాములకోసం రూ.56 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు జొమాటో సహ-వ్యవస్థాపకుడు, సీవోవో గౌరవ్ గుప్తా తెలిపారు.

ప్రస్తుతం బెంగళూరుతోపాటు ఢిల్లీలో మాత్రమే జొమాటో గోదాములను నిర్వహిస్తున్నది. ఒక్కో గోదాము ఏర్పాటు చేయడానికి 4 లక్షల డాలర్లు (రూ. 2.8 కోట్ల) నిధులను వెచ్చించనున్నట్లు, వీటికి నిర్వహణ ఖర్చులు అదనమని మాటో సహ-వ్యవస్థాపకుడు, సీవోవో గౌరవ్ గుప్తా చెప్పారు. 

ఢిల్లీలో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గోదామును ఇటీవల జొమాటో ప్రారంభించింది. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గోదాము ద్వారా రోజుకు 3 వేల రెస్టారెంట్లకు సరుకులు సరఫరా చేయవచ్చునని మాటో సహ-వ్యవస్థాపకుడు, సీవోవో గౌరవ్ గుప్తా చెప్పారు.

ఈ గిడ్డంగులు అందుబాటులోకి వస్తే జొమాటో సామర్థ్యం 90 వేల మెట్రిక్ టన్నులకు, 7 లక్షల చదరపు అడుగులకు చేరుకోనున్నది. ఢిల్లీ, బెంగళూరులతోపాటు ముంబై, పుణె, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, వడోదర, లక్నో, ఆగ్రా, గోవా, సూరత్‌లలో నెలకొల్పనున్నట్లు మాటో సహ-వ్యవస్థాపకుడు, సీవోవో గౌరవ్ గుప్తా వెల్లడించారు. 

ఇతర దేశాల్లో కూడా గిడ్డంగులను ఏ ర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా మాటో సహ-వ్యవస్థాపకుడు, సీవోవో గౌరవ్ గుప్తా  చెప్పారు. ఎప్పటిలోగా గ్లోబల్ మార్కెట్లో ప్రవేశించేదాని పై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

click me!