Zomato, Swiggy down: దేశ వ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ సర్వీసులు డౌన్, సమస్య తాత్కాలికం అంటున్న సంస్థలు...

Published : Apr 06, 2022, 03:15 PM IST
Zomato, Swiggy down: దేశ వ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ సర్వీసులు డౌన్, సమస్య తాత్కాలికం అంటున్న సంస్థలు...

సారాంశం

Zomato, Swiggy down: దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో కస్టమర్లు ఇబ్బందులకు గురయ్యారు. దేశ వ్యాప్తంగా పలు రెస్టారెంట్లతో అనుసంధానం అయిన ఈ రెండు సంస్థల యాప్స్ సాంకేతిక లోపాల కారణంగా సర్వీస్ డౌన్ సమస్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. 

ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ దిగ్గజ యాప్స్ Zomato,Swiggy సాంకేతిక కారణాల వల్ల బుధవారం దేశవ్యాప్తంగా నిలిచిపోయి. దీంతో  చాలా మందికి అసౌకర్యానికి గురవుతున్నారు. సాంకేతిక లోపం వల్ల జరిగిందని, అమెజాన్ వెబ్ సర్వీస్ క్రాష్ కావడం కూడా ఒక కారణం కావచ్చని పేర్కొంటున్నారు. 

Swiggy కేవలం రెండు సెకన్ల పాటు మాత్రమే డౌన్ అయ్యింది, Zomato కూడా వినియోగదారులకు బాగానే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే యాప్ డౌన్ అయినప్పుడు కస్టమర్లు ఇబ్బంది పడ్డారు.  యాప్ క్రాష్ అయిన సమయంలో ఆర్డర్ "ఆన్ ద వే"లో ఉన్నట్లు చూపిందని, కానీ తన ఆర్డర్‌ను ట్రాక్ చేయలేకపోయినట్లు ఒక కస్టమర్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

Zomato సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేసిన కాసేపటి తర్వాత తాను ఫుడ్ ఆర్డర్ చేయలేకపోయానని మరో యూజర్ తెలిపారు. అంతేకాదు కస్టమర్లు చాల మంది ఫుడ్ మెనుని యాక్సెస్ చేయలేకపోయారు. జొమాటో, స్విగ్గీ వినియోగదారుల ఫిర్యాదులపై స్పందిస్తూ తాము "తాత్కాలిక లోపం"ని పరిశీలిస్తున్నామని పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !