జొమాటో వ్యవస్థాపకుడుగా యావత్ ప్రపంచానికి పరిచయమైన పేరు. దీపిందర్ గోయల్ ఈయన అతి చిన్న వయస్సులోనే దేశంలోనే టాప్ మిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. తనను తాను ఒక జొమాటో డెలివరీ బాయ్ అని చెప్పుకునే గోయల్, ప్రస్తుతం యూత్ ఐకాన్ గా నిలుస్తున్నారు.
జీవితం కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఒక చిన్న సంఘటన జీవిత దిశను మార్చివేస్తుంది. పాఠశాల పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి ఏదో ఒకరోజు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోగలడు. పేదరికంలో పుట్టిన వ్యక్తి ఏదో ఒక రోజు కోటీశ్వరుడై విలాసవంతమైన జీవితాన్ని గడపగలడు. ప్రస్తుత పరిస్థితిని చూసి ఒక వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడం నిజంగా తప్పే దీనికి ఉత్తమ ఉదాహరణ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ఆయన సీఈవో మాత్రమే కాదు జొమాటో వ్యవస్థాపకుడు కూడా. దీపిందర్ గోయల్ కథ నిజంగా యువతకు స్ఫూర్తిదాయకం. విజయం సాధించడానికి అతను తన వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. జొమాటో మొదట్లో నష్టాల్లో కూరుకుపోయినా, ఆ తర్వాత లాభదాయకంగా మారింది. నేడు, Zomato దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ యాప్‌గా ఉంది, దీనికి కారణం గోయల్ సంకల్పం, కృషి కారణం అని చెప్పవచ్చు.
పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జన్మించిన దీపిందర్ గోయల్ చిన్నతనంలో తెలివైన విద్యార్థి కాదు. గోయల్ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఇది గోయల్ జీవితంలో కొత్త మలుపు తిరిగింది. ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. ఈ సంఘటన తర్వాత, గోయల్ పాఠశాల టాపర్లలో ఒకడు అయ్యాడు.
ఐఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి గోయల్ కుటుంబం అతన్ని చండీగఢ్ పంపింది. అయితే గోయల్ సరిగా ప్రిపేర్ కాలేదు. అలాగే ఇంటికి తిరిగొచ్చాడు. అయితే, తర్వాత రోజుల్లో ఐఐటీ ఢిల్లీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీపిందర్ 2005లో ఢిల్లీ ఐఐటీ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత తన స్నేహితుడు పంకజ్ చడ్డాతో కలిసి జొమాటోను స్థాపించి గోయల్ తన విజయ యాత్ర ప్రారంభించాడు.
2021లో Zomatoలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత, దీపిందర్ గోయల్ నికర విలువ రూ.5,345 కోట్లకు పెరిగింది. ఆ సమయంలో, Zomatoలో అతని వాటా 4.7 శాతం. కరోనా మహమ్మారి సమయంలో జోమాటో డెలివరీ భాగస్వాముల పిల్లల విద్య కోసం దీపిందర్ గోయల్ రూ. 700 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు జొమాటోలో పనిచేసే తన పార్ట్నర్స్ ను డెలివరీ బాయ్స్ కు ఆయన ఎంతో సహాయం చేశారు ముఖ్యంగా జొమాటోలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ పిల్లల చదువుల కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టాడు. దీంతోపాటు గోయల్ జొమాటోలో పనిచేసే మహిళలు అదేవిధంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టాడు.
గోయల్ ప్రస్తుతం గోయల్‌కి జోమాటో కంపెనీ నుంచి ఎలాంటి జీతం పొందడం లేదు. అయితే గోయల్ ఏటా రూ.358 కోట్లు కంపెనీ నుంచి అందుకుంటున్నాడు. అంటే రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.66,874 కోట్లు. ఇప్పుడు Instagram లో, గోయల్ తనను తాను Zomato డెలివరీ బాయ్ పిలిపించుకోవడం చాలా ఇష్టం. ఒక్కోసారి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా వెళ్తుంటారు. దాని ద్వారా సంస్థ పేరును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.