మీరు ఫారెన్ టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. మీ ఫ్యామిలీతో సహా విదేశాలకు వెళ్లి విహారయాత్ర చేయాలని అనుకుంటున్నారా. అయితే వీసా పొందడం పెద్ద అడ్డంకి అని భావిస్తున్నారా. ? ఏమాత్రం టెన్షన్ పడకండి ఎందుకంటే కేవలం భారతీయ పాస్ పోర్ట్ ఉంటే చాలు సుమారు 57 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే వెళ్ళవచ్చు.
ప్రస్తుతం, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 57 దేశాలను సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఈ దేశాల్లో భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఇస్తారు. వీసా ఆన్ అరైవల్‌లో, సంబంధిత దేశానికి చేరుకున్న తర్వాత, ప్రయాణికులకు వెంటనే విమానాశ్రయంలోనే వీసా ఇవ్వబడుతుంది. దీని ప్రక్రియ కూడా సులభం, దీని కారణంగా ప్రయాణికులు కూడా చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
ఇదిలా ఉంటే హెన్లీ నివేదిక ప్రకారం, సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అవతరించింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌పై ప్రపంచంలోని 192 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వబడుతుంది. అదే సమయంలో గత 5 ఏళ్లుగా నంబర్ వన్ పాస్ పోర్ట్ గా ఉన్న జపాన్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది.
భారతదేశం నుండి ఈ 57 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. పూర్తి లిస్టు ఇదే.
ఫిజీ , మార్షల్ దీవులు , మైక్రోనేషియా , నియు , పలావు ద్వీపం , సమోవా , తువాలు, వనతు ,ఇరాన్ , జోర్డాన్ , ఒమన్ , ఖతార్ , అల్బేనియా , సెర్బియా , బార్బడోస్ , బ్రిటిష్ వర్జిన్ దీవలు, డొమినికా , గ్రెనడా , హైతీ , జమైకా , మోంట్సెరాట్ , సెయింట్ కిట్స్ నెవిస్ . సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్స్ , ట్రినిడాడ్ అండ్ టొబాగో, కంబోడియా , ఇండోనేషియా , భూటాన్ , సెయింట్ లూసియా , లావోస్ , మకావ్ , మాల్దీవులు, మయన్మార్ , నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ , తైమూర్-లెస్టే, బొలీవియా, గినియా-బిస్సావు, మడగాస్కర్, మౌరిటానియా , మారిషస్ , మొజాంబిక్ , రువాండా , సెనెగల్ , సీషెల్స్, సియెర్రా లియోన్ , సోమాలియా , టాంజానియా , టోగో , ట్యునీషియా, జింబాబ్వే , కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు , బురుండి, కజకిస్తాన్, ఎల్ సాల్వడార్
పైన పేర్కొన్నటువంటి దేశాలను విజిట్ చేసేందుకు మనకు కేవలం ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే సరిపోతుంది. ముందస్తు వీసా లేకుండానే మీరు ఈ దేశాల్లో పర్యటించవచ్చు తద్వారా మీరు విదేశాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. థాయిలాండ్, శ్రీలంక, భూటాన్, మారిషస్, సీషెల్స్, మాల్దీవులు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ దేశాలకు మీరు ముందస్తు వీసా లేకుండానే కేవలం పాస్ పోర్ట్ ఉంటే చాలు వెళ్ళవచ్చు.