Business Ideas: ఎవరూ చేయని ఈ బిజినెస్ చేయడం ద్వారా, సాయంత్రం రెండు గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.2 లక్షలు మీవే

Published : Mar 12, 2023, 06:38 PM IST
Business Ideas: ఎవరూ చేయని ఈ బిజినెస్ చేయడం ద్వారా, సాయంత్రం రెండు గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.2 లక్షలు మీవే

సారాంశం

వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా, అయితే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృధా చేయకండి. ఓ చక్కటి వ్యాపార ఐడియాతో మీ ముందుకు వచ్చేసాము. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు తక్కువ పెట్టుబడి తోనే మీరు ఆదాయం సంపాదించే వీలు కలుగుతుంది. 

ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా మీరు సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పటికీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో ఫుడ్ బిజినెస్ కు మంచి అవకాశం ఉంది ఎందుకంటే ఉద్యోగులు వ్యాపారస్తులు అలాగే విద్యార్థులు ఎక్కువగా పట్టణాల్లో ఉంటారు వీరికి వంట చేసుకోవడానికి ఎక్కువగా సమయం దక్కదు అలాగే హాస్టల్స్ లో కూడా ఉండటం వల్ల మీరు బయట ఆహారం తినేందుకే అవకాశం ఉంటుంది ఇలాంటి వారి కోసమే మీరు హెల్తీ ఆహారాన్ని అందించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

ఈ మధ్యకాలంలో వైద్యులు అన్నం బదులుగా చిరుధాన్యాలను తినమని ప్రోత్సహిస్తున్నారు.  ముఖ్యంగా అన్నంలో ఉండే పిండి పదార్థం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలను ఒక పూట తినాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుధాన్యాల్లో పెద్ద ఎత్తున ఫైబర్ అలాగే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  చిరుధాన్యాలను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్ ను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అనేక జబ్బుల నుంచి చిరుధాన్యాలు మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. 

మీరు దీన్ని వ్యాపార అవకాశంగా మార్చుకోవాలి. అనుకుంటే సాయంకాలం పూట చిరుధాన్యాలతో చేసినటువంటి వంటలను విక్రయించడం, ద్వారా చక్కటి వ్యాపార అవకాశం లభించే వీలుంది.  చిరుధాన్యాల్లో సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు, సజ్జలు, రాగులతో చేసిన వంటకాలను తినేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. 

Business Ideas: చదువుతో పనిలేదు, టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు. ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష మిగిలే చాన్స్

సాయంకాలం పూట చిరుధాన్యాలతో చేసిన చపాతీలు పుల్కాలు అమ్మితే చక్కటి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన చపాతీలు తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు వీటిని విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు.  అలాగే కొర్రలు సామలు ఊదలతో చేసిన దోశలు ఇడ్లీలు ఊతప్పం తినేందుకు సైతం జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీటిని తక్కువ ధరకే అందుబాటులో ఉంచితే ప్రజలు ఎక్కువగా తినేందుకు ముందుకు వస్తారు. అదే మీరు రూ.100 లేదా రూ.150 లకు అన్ లిమిటెడ్ టిఫిన్స్ ఆఫర్ చేయడం ద్వారా కూడా చక్కటి ప్రచారం పొందవచ్చు.  

Business Ideas: సమ్మర్ లో ఈ బిజినెస్ చేస్తే, కూర్చున్న చోటే కాలు కదపకుండా, 3 నెలల్లో 3 లక్షలు వెనకేసుకోవచ్చు..

మంచి జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో ఈ హోటల్ తెరవడం ద్వారా చక్కటి రెస్పాన్స్ పొందవచ్చు. అలాగే చిరు ధాన్యాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలి. అలాగే డిజిటిల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం ద్వారా చక్కటి ప్రచారం పొందే వీలుంది. 

PREV
click me!

Recommended Stories

IRCTC : రైల్వే బంపర్ ఆఫర్.. 4 వేల లోపు పెట్టుబడితో లైఫ్ సెటిల్ బిజినెస్ !
Gold Price: 2020లో రూ. ల‌క్షతో బంగారం కొని ఉంటే.. ఈరోజు మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా?