అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు యస్‌ బ్యాంక్‌ నోటీసులు

By Sandra Ashok KumarFirst Published Jul 30, 2020, 3:46 PM IST
Highlights

 2,892 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైన నేపథ్యంలో ప్రైవేటు రంగ రుణదాత యెస్ బ్యాంక్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఇన్‌ఫ్రా) కు చెందిన పలు ఆస్తులకు స్వాధీనం చేసుకునేందుకు నోటీసు ఇచ్చింది. 

ముకేష్ అంబానీ తనయుడు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీన పరచుకునేందుకు యస్‌ బ్యాంక్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2,892 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైన నేపథ్యంలో ప్రైవేటు రంగ రుణదాత యెస్ బ్యాంక్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఇన్‌ఫ్రా) కు చెందిన పలు ఆస్తులకు స్వాధీనం చేసుకునేందుకు నోటీసు ఇచ్చింది.

ముంబైలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రధాన కార్యాలయం శాంటాక్రూజ్ ఈస్ట్‌లో ఉంది. ఇతర ఆస్తులలోని  చర్చ్ గేట్‌కు సమీపంలో ఉన్న నాగిన్ మహల్‌లో రెండు అంతస్తులు ఉన్నాయి. జూలై 22నా ఇచ్చిన నోటీసులో, బకాయిలను తిరిగి పొందేందుకు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాపర్టీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంటరెస్ట్ (సర్ఫెసి) చట్టం కింద ఆర్‌ఇన్‌ఫ్రాకు నోటీసు ఇచ్చినట్లు యెస్ బ్యాంక్ పేర్కొంది.

also read రేమాండ్‌‌కు షాక్.. సూట్లు, బిజినెస్ దుస్తులు ధ‌రించ‌డం మానేశారు.. ...

యెస్ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూపుకు రూ.12 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపింది. డి‌హెచ్‌ఎఫ్‌ఎల్, క్రాంప్టన్ గ్రీవ్స్, జీ గ్రూప్ సహా ఇతర సంస్థల హోస్ట్ కూడా యెస్ బ్యాంకుకు తమ రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. మే నెలలో యెస్ బ్యాంక్ ఆడిటర్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బ్యాంక్ అనేక రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, రుణ ఒప్పందాలను ఉల్లంఘించినట్లు ఎత్తి చూపారు. ఆర్థిక ఫలితాలు 2019 డిసెంబర్‌తో ముగిసిన కాలానికి అదనంగా రూ .15,422 కోట్లు కేటాయించాల్సి ఉందని పేర్కొంది.


ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా యస్‌ బ్యాంకులో మెజారిటీ వాటాను పొందింది. తద్వారా యస్ బ్యాంక్‌ కార్యకలాపాలను ఎస్‌బీఐ తిరిగి గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్యాంకింగ్  వర్గాలు తెలియజేశాయి.

బుధవారం, యెస్ బ్యాంక్ షేర్లు ఎఫ్‌పి‌ఓ ధర కంటే 11.75 రూపాయలకు పడిపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బకాయిలు చెల్లించలేనని అనిల్ అంబానీ ఇప్పటికే యూ.‌కే హైకోర్టులో అంగీకరించారు. కానీ చైనా బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు చెల్లించాలని లేదా చర్యను ఎదుర్కోవాలని యుకె హైకోర్టు అనిల్ అంబానీకి తెలిపింది.
 

click me!