యస్ బ్యాంకు కుంభకోణం: వాధవాన్ సోదరులకు హైకోర్టు బెయిల్ మంజూరు

By Sandra Ashok KumarFirst Published Aug 20, 2020, 4:08 PM IST
Highlights

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తమపై చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున జస్టిస్ భారతి డాంగ్రే వారికి బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరు ఒక్కొ లక్ష రూపాయలు సెక్యూరిటీగా జమ చేసి వారి పాస్‌పోర్టులను వారికి తితిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

యెస్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లకు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తమపై చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున జస్టిస్ భారతి డాంగ్రే వారికి బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరు ఒక్కొ లక్ష రూపాయలు సెక్యూరిటీగా జమ చేసి వారి పాస్‌పోర్టులను వారికి తితిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

also read 

ఇదే కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా కేసు నమోదు చేసినందున వీరిద్దరూ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. 60 రోజుల వ్యవధిలో ఇడి తన చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైందని వారు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనపై జస్టిస్ భారతి డాంగ్రే సానుకూలంగా స్పందించారు.

మనీలాండరింగ్ ఆరోపణలపై కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లను మే 14న ఇడి అరెస్టు చేసింది. జూలై 15న వధావన్స్ సోదరులు, యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్, అతని భార్య బిందు కపూర్, కుమార్తెలు రోష్ని, రేఖ, వారి చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థ దులరేష్ కె జైన్, అసోసియేట్ లపై ఇడి చార్జిషీట్ దాఖలు చేసింది.

'క్విడ్ ప్రో క్వో' కు సంబంధించి సిబిఐ మార్చి 7న రానా కపూర్, వధావాన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో విచారణ ప్రారంభించింది.

click me!