వరుసగా 5వ రోజు కూడా పెట్రోల్‌ ధర పెంపు.. లీటరు ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Aug 20, 2020, 12:34 PM IST
Highlights

దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.81 చేరింది, చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.84. అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగా ఉంది ఎలాంటి మార్పులు జరగలేదు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర వరుసగా రెండవ రోజు కూడా సానుకూలంగా కొనసాగింది. 

న్యూ ఢీల్లీ: ఒక రోజు విరామం తరువాత, గురువారం రోజున అంటే నేడు మళ్లీ పెట్రోల్ ధరను పెంచారు. దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.81 చేరింది, చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.84. అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగా ఉంది ఎలాంటి మార్పులు జరగలేదు.

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర వరుసగా రెండవ రోజు కూడా సానుకూలంగా కొనసాగింది. బెంచ్ మార్క్ ముడి చమురు బ్రెంట్ ధర బ్యారెల్కు 45 డాలర్లకు పడిపోయింది. ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై నాలుగు మెట్రోల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం పెట్రోల్ ధరను 10 పైసలు పెంచాయి.

ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం 

పెట్రోల్ ధర 

ఢీల్లీ రూ.81, కోల్‌కతా రూ.82.53, ముంబై రూ.87.68, చెన్నైలలో రూ.84.09, హైదరాబాద్‌లో రూ.84.18. 

also read ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం వాడుతున్నారా అయితే జాగ్రత్త.. క్యాష్ విత్‌డ్రా చేసేటప్పుడు.. ...

డీజిల్ ధర 
ఢీల్లీ రూ .73.56, కోల్‌కతా రూ.77.06,ముంబై  రూ.80.11, చెన్నైలలో రూ .78.86. హైదరాబాద్‌లో రూ.80.17.

గత ఐదు రోజుల్లో పెట్రోల్‌పై చమురు కంపెనీలు రూ.50పైసలకు పైగా పెంచాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఐసిఇపై బ్రెంట్ క్రూడ్ అక్టోబర్ డెలివరీ కాంట్రాక్ట్ బ్యారెల్కు 44.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, అంతకుముందు సెషన్తో పోలిస్తే ఇది 0.84 శాతం తగ్గింది.

అమెరికన్ లైట్ క్రూడ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లేదా డబ్ల్యుటిఐ సెప్టెంబర్ డెలివరీ కాంట్రాక్ట్ బ్యారెల్కు 42.67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, ఇది మునుపటి సెషన్తో పోలిస్తే 1.02 శాతం తగ్గింది.

మీ నగరంలో పెట్రోల్ ధరను మీరు తెలుసుకోవాలంటే మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా పెట్రోల్, డీజిల్ రేటును తెలుసుకోవచ్చు. ఆర్‌ఎస్‌పి టైప్ చేసి బిపిసిఎల్ కస్టమర్లు 9223112222 కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా ధర తెలుసుకోవచ్చు.

హెచ్‌పిసిఎల్ వినియోగదారులు హెచ్‌పిప్రైస్ టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను పొందవచ్చు. ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సావరిస్తాయి. సవరించిన ధరలు ప్రతి రోజు ఉదయం 6 నుండి వర్తిస్తాయి.
 

click me!