‘తీవ్ర మాంద్యం’ తప్పదు.. ద్వితీయార్థం తర్వాతే రివైవల్: ఐఎంఎఫ్‌

By narsimha lodeFirst Published Apr 19, 2020, 10:40 AM IST
Highlights

రోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘తీవ్ర ఆర్థిక మాంద్యం’ ఎదుర్కోబోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. కరోనాకు పూర్వం మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో తీవ్ర సంక్షోభం చవి చూడబోతున్నదని పేర్కొంది. 

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘తీవ్ర ఆర్థిక మాంద్యం’ ఎదుర్కోబోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. కరోనాకు పూర్వం మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో తీవ్ర సంక్షోభం చవి చూడబోతున్నదని పేర్కొంది. 

ముఖ్యంగా కరోనా మహమ్మారితో తలెత్తిన విపత్కర పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులకు ఇది అతిపెద్ద సవాల్ కానున్నాయని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా పేర్కొన్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్‌ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ప్రపంచ ఆర్థికంలో పెద్దఎత్తున కోత తప్పదని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా హెచ్చరించారు. వాణిజ్య వివాదాలు, రాజకీయ అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉందని క్రిస్టిలినా పేర్కొన్నారు.

ఈ క్రమంలో కరోనా కారణంగా 2020లో తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతోందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లోని శాసనకర్తలకు కరోనా మహమ్మారి విసిరిన పంజాను ఎదుర్కోవడం సవాలేనని అభిప్రాయపడ్డారు. 

ఇదివరకే ఈ మహమ్మారి బారిన పడిన అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కోల్పోయాయని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా చెప్పారు. ఆయా దేశాల్లో పర్యాటకం దెబ్బతిందని, ఆహారం, మందులు వంటి సరకుల దిగుమతిలో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. 

తొలుత కరోనా వైరస్‌ బారిన పడిన దేశాలైన చైనా, దక్షిణ కొరియా, ఇటలీలో ఇప్పటికే తయారీ రంగం దెబ్బతిందని, సేవలు నిలిచి పోయాయని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనేది వ్యాక్సిన్ల అభివృద్ధి, థెరపీలు, సరఫరా గొలుసును పునురుద్ధరించడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 

ప్రజారోగ్యానికి మెరుగైన చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి ప్రారంభం అవుతుందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా  అన్నారు. 2021లో కోలుకోవడం ప్రారంభమైతే అదే ఏడాది చివరికి నాటికి కరోనా ముందు నాటి కంటే దిగువ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. 

ప్రస్తుతం ఈ మహమ్మారి కారణంగా మరిన్ని మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా సూచించారు. 

మరణాల రేటు తగ్గించడడానికి, వైరస్‌ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా చెప్పారు. ఆర్థికంగా ఇంకా వెనుకబాటులో ఉన్న దేశాలకు అంతర్జాతీయ సమాజం సాయం అందించాలని పిలుపునిచ్చారు.

click me!