మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే సింపుల్...

Ashok Kumar   | Asianet News
Published : Apr 17, 2020, 06:13 PM IST
మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే సింపుల్...

సారాంశం

కరోనా వైరస్ సంక్షోభం కారణంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-ఈ‌పి‌ఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-ఈ‌పి‌ఎఫ్‌ఓ. 

ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నవారు పి‌ఎఫ్ కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు ఒకోసారి. ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారినపుడు పి‌ఎఫ్ అక్కౌంట్ అడుగుతుంటారు. వారి ప్రతి నెల వేతనం నుండి కొంత పి‌ఎఫ్ కట్ అవుతుంది.

ఎంత కట్ అవుతుంది లేదా పి‌ఎఫ్ గురించి ఏదైనా ఇతర సమాచారం గురించి తెలుసుకోవడానికి కొందరు కాస్త ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని సులభమైన విధాలను కొన్ని ఉన్నాయి.

మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? తెలుసుకొవాలనుకుంటున్నారా? ఇప్పుడు కేవలం ఒక  జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు. లేదా  ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈపీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది.

ఇళ్లనుండి బయటికి వెళ్లలేని పరిస్థితి దీనికి తోడు నిత్యవసర సరుకుల కొరత, ఈతర కొనుగోళ్లకు ఇబ్బందులు. కరోనా వైరస్ సంక్షోభం కారణంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-ఈ‌పి‌ఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-ఈ‌పి‌ఎఫ్‌ఓ.

ఇందుకోసం ఈపీఎఫ్ పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీని లిస్ట్‌లో చేర్చింది. 15 రోజుల్లో 3.31 లక్షల క్లెయిమ్స్‌ని ఈపీఎఫ్ఓ సెటిల్ చేసింది. అందుకోసం రూ.946.49 కోట్లను ఈపీఎఫ్ ఖాతాదారులకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇంకా లక్షల్లో క్లెయిమ్స్ వస్తున్నాయి, వాటినీ సెటిల్ చేసే పనిలో ఈపీఎఫ్ఓ  నిమగ్నం అయింది.

అయితే ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకున్న తర్వాతే క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడం చాలా మంచిది. ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న మొత్తం 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది డ్రా చేసుకునే అవకాశం ఉంది.

మరి ఇది లెక్కించాలంటే మీ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలి. బ్యాలెన్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపినా లేదా మిస్డ్ కాల్ ఇచ్చినా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుస్తుంది.

ఇవి మాత్రమే కాదు ఇంక వేర్వేరు మార్గాలు కూడా ఊన్నాయి. అవేంటో తెలుసుకోండి.మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఏఎన్ అకౌంట్‌తో రిజిస్టరై ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి.

ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్‌తో ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లాంటి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయడం తప్పనిసరి. అప్పుడే మీరు ఎస్ఎంఎస్ ద్వారా పీఎప్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ వివరాలు తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.

 ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/ ఓపెన్ చేయాలి. Our Services ట్యాబ్‌లో for employees అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. Services ఆప్షన్‌లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. తరువాత  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు.


 మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఓపెన్ చేసి ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన వివరాలన్నీ చూడొచ్చు.

ఈ పద్ధతుల ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎంత డ్రా చేసుకునే అవకాశం ఉందో లెక్కించొచ్చు. అయితే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి అత్యవసరమైతే తప్ప డబ్బులు డ్రా చేయకూడదు. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటే తప్ప మీ ఆర్థిక సమస్యలు తీరవనుకుంటేనే క్లెయిమ్‌కు అప్లై చేయాలి. 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?