Women's Day 2022: మహిళలకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న కోటి రూపాయల రుణం కోసం ఇలా అప్లై చేయండి..

Published : Mar 07, 2022, 03:14 PM IST
Women's Day 2022: మహిళలకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న కోటి రూపాయల రుణం కోసం ఇలా అప్లై చేయండి..

సారాంశం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా చేయూతను అందించేందుకు అనేక కొత్త పథకాలను అమలు చేస్తూనే ఉంది. వీటిలో స్టాండ్-అప్ ఇండియా పథకం (Stand-up India scheme) ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చు.

Women's Day 2022: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల గురించి చర్చించుకోవడం ఎంతో అవసరం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా చేయూతను అందించేందుకు అనేక కొత్త పథకాలను అమలు చేస్తూనే ఉంది. వీటిలో స్టాండ్-అప్ ఇండియా పథకం (Stand-up India scheme) ఒకటి.

ఈ పథకం ద్వారా దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చు. తద్వారా పథకం కింద షెడ్యూల్డ్ మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తారు. తద్వారా మహిళలు సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

స్టాండ్-అప్ ఇండియా పథకం అంటే ఏమిటి? (What is Stand-up India Scheme?)
ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అన్ని తరగతుల మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించారు. దీనితో పాటుగా, మహిళలు స్వంతంగా ప్రత్యేక స్టార్టప్‌ను ప్రారంభించేందుకు ఈ పథకంలో బ్యాంకు నుండి సహాయం పొందవచ్చు. దాదాపు రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఈ పథకం ద్వారా రుణం పొందే వీలుంది.

బ్యాంక్ ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఈ మొత్తానికి వడ్డీ రేటు నిర్ణయిస్తారు. ఇది కాకుండా, 18 నెలల నుండి 7 సంవత్సరాల వరకు బ్యాంకు మొత్తాన్ని సులభంగా తిరిగి చెల్లించవచ్చు.

ఈ ప్రణాళిక  లక్ష్యం ఇదే.. (Objective of this plan)
>> ప్రతీ ప్రభుత్వ బ్యాంకు శాఖలో కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీకి ఉపాధి కల్పించడమే ఈ పథకం అసలు లక్ష్యం.

>> మహిళలు తమ సొంత సెటప్‌ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, వారికి బ్యాంకు నుండి సుమారు 10 లక్షల నుండి 1 కోటి వరకు ఆర్థిక సహాయం పొందుతారు.

పథకం అర్హత (Scheme Eligibility)

>> షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు లేదా మహిళా పారిశ్రామికవేత్తలు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

>> ఈ పథకంలో చేరేందుకు మహిళలు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.

కావలసిన పత్రములు (Required documents)
>> పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి
>> కుల ధృవీకరణ పత్రం
>> శాశ్వత సర్టిఫికేట్
>> వ్యాపార ధృవీకరణ పత్రం
>> పాస్పోర్ట్ సైజు ఫోటో
>> బ్యాంకు ఖాతా
>> మొబైల్ నంబర్
>> ప్రాజెక్ట్ నివేదిక

స్టాండ్-అప్ ఇండియా స్కీమ్ దరఖాస్తు ప్రక్రియ (Stand-up India Scheme Application Process)
>> ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, మీరు ముందుగా ప్రభుత్వం జారీ చేసిన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
>> యాక్సెస్ లోన్ ఎంపికపై క్లిక్ చేసి, ఇక్కడ దరఖాస్తుపై క్లిక్ చేయాలి.
>> దీని తర్వాత మీరు న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌పై క్లిక్ చేయాలి. ఇది మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అడుగుతుంది. అక్కడ మీరు వివరాలు నింపాలి.
>> దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. మీరు సైడ్ కాలమ్‌లో పూరించాలి.
>> దీని తర్వాత దరఖాస్తు ఫారమ్ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా పూరించండి. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?