Multibagger Stock: ఈ స్టాక్ లో జస్ట్ రూ.1 లక్ష పెట్టుబడితే చాలు...రూ.1.58 కోట్లు మీ సొంతం అయ్యేవి..

Published : Apr 05, 2022, 04:28 PM IST
Multibagger Stock: ఈ స్టాక్ లో జస్ట్ రూ.1 లక్ష పెట్టుబడితే చాలు...రూ.1.58 కోట్లు మీ సొంతం అయ్యేవి..

సారాంశం

మల్టీ బ్యాగర్ స్టాక్స్ మీ పోర్టు ఫోలియోలో ఉంటే చాలు ఒక్కోసారి అవి మీ పెట్టుబడిని కోట్లుగా మార్చేస్తుంటాయి. కొన్ని పెన్నీ స్టాక్స్ మన ఊహకు కూడా అందనంత రేంజులో పెరుగుతుంటాయి. అలాంటి ఓ స్టాక్ ఇన్వెస్టర్ పెట్టుబడిని కేవలం ఒక సంవత్సర కాలంలో రూ. 1 లక్ష నుంచి రూ. 1.58 కోట్లుగా మార్చింది. అలాంటి ఓ స్టాక్ పై ఓ కన్నేద్దాం. 

స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం ఇన్వెస్టర్లు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. తమ పోర్టుఫోలియోలోని స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా మారాలని కోరుకుంటారు. బలమైన ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ అలాగే జోరుగా కదిలి ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో కొన్ని స్టాక్స్ వందల రెట్లు పెరగడం కూడా జరగవచ్చు. చాలా వరకూ పెన్నీ స్టాక్‌లలో ఇలా జరగడం చూస్తుంటాం. 

అటువంటి మల్టీబ్యాగర్ స్టాక్ కైజర్ కార్పొరేషన్ (Kaiser Corporation). ఒక సంవత్సరం క్రితం, ఈ పెన్నీ స్టాక్‌ లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులను కోటీశ్వరులను చేసింది. ఈ స్టాక్ ఒక్క ఏడాదిలోనే 15,000 శాతానికి పైగా జంప్ చేసింది. కేవలం ఒక్క ఏడాదిలోనే లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లను కోటీశ్వరులను  చేసింది. ఈ స్టాక్ ఊపు ఇంకా కొనసాగిస్తోంది. మంగళవారం, ఏప్రిల్ 5, ఈ స్టాక్ కూడా బుల్లిష్‌గానే ఉంది మరియు ఇది 4.98 శాతం లాభంతో రూ. 60.5 వద్ద ట్రేడవుతోంది.

ఒక్క ఏడాదిలోనే భారీ జంప్
కైజర్  కార్పొరేషన్ షేరు ధర (Kaiser Corporation Share Price) 12 ఏప్రిల్ 2021న కేవలం 0.38 పైసల వద్ద ముగిసింది. ఈరోజు, ఏప్రిల్ 5, 2022న, ఈ స్టాక్ ధర ఒక్కో షేరుకు రూ. 60.05కి చేరుకుంది. ఈ స్టాక్ ఏడాది పొడవునా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ కాలంలో స్టాక్ 15,702 శాతం లాభపడింది. అదే సమయంలో, మనం 2022 సంవత్సరం గురించి మాట్లాడినట్లయితే, ఈ సంవత్సరం కూడా ఈ స్టాక్ ఇప్పటివరకు 1900 శాతం రాబడిని ఇచ్చింది. జనవరి 3, 2022న షేర్ ధర రూ. 2.92. ఇప్పుడు రూ.65.5 అయింది.

గత నెలలో ఈ కైజర్ కార్పొరేషన్ స్టాక్ రూ.22 నుంచి రూ.60.05కి పెరిగింది. ఈ విధంగా, ఈ కాలంలో 161 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. లేబుల్స్, స్టేషనరీ, మ్యాగజైన్‌లు, కార్టన్ ప్రింటింగ్‌లో కైజర్  కార్పొరేషన్ లిమిటెడ్ డీల్ చేస్తుంది. ఇది ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రిక్, మెకానికల్ హీట్ ట్రేసింగ్ మొదలైన వాటి అనుబంధ సంస్థలతో కూడా వ్యవహరిస్తుంది.

లక్ష పెట్టుబడితో 1.58 కోట్లు
ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి 38 పైసలకు కైజర్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేసి మీ వద్ద ఉంచుకుంటే, ఈరోజు ఆ పెట్టుబడి విలువ రూ.1.58 కోట్లు. అదేవిధంగా, ఒక ఇన్వెస్టర్ జనవరి 3, 2022న ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఈరోజు ఈ మొత్తం రూ.20.56 లక్షలకు పెరిగి ఉండేది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు