కారణమిదే: ఇక ఆ డెబిట్ , క్రెడిట్ కార్డులు చెల్లవు

By narsimha lodeFirst Published Sep 21, 2018, 5:41 PM IST
Highlights

చిప్ ఆధారిత క్రెడిట్, డెబిట్ కార్డులే భవిష్యత్తులో పనిచేస్తాయి. ప్రస్తుతం వాడుతున్న మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డుల స్థానంలో ఈఎంవి చిప్ అధారిత కార్డులు అందుబాటులోకి రానున్నాయి.


న్యూఢిల్లీ: చిప్ ఆధారిత క్రెడిట్, డెబిట్ కార్డులే భవిష్యత్తులో పనిచేస్తాయి. ప్రస్తుతం వాడుతున్న మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డుల స్థానంలో ఈఎంవి చిప్ అధారిత కార్డులు అందుబాటులోకి రానున్నాయి.

2019 జనవరి నుండి  చిప్ ఆధారిత క్రెడిట్, డెబిట్ కార్డులు మాత్రమే  మనుగడలో ఉంటాయి. మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులు 2018 డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే పనిచేస్తాయి. 

పాత డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల స్ధానంలో చిప్‌ ఆధారిత కార్డులు పొందాలని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను హ్యాక్‌ చేయడం, క్లోనింగ్‌ ద్వారా ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో వినియోగదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ చిప్‌ ఆధారిత కార్డులను ప్రవేశపెట్టాలని బ్యాంకులను ఆదేశించింది.

ప్రస్తుతం వాడుతున్న మాగ్నెటిక్‌​ స్ర్టిప్‌ కార్డుల స్ధానంలో ఈఎంవి చిప్‌ ఆధారిత కార్డులు పొందాలని ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లను కోరుతున్నాయి. ఈఎంవి చిప్‌ ఆధారిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు జనవరి 2016 నుంచి వినియోగంలో ఉన్నాయి. 

2016 జనవరి 31 తర్వాత కొత్తగా ఖాతాలు తెరిచే కస్టమర్లకు చిప్‌ ఆధారిత కార్డులే అందించాలని ఆర్‌బీఐ బ్యాంకులు విస్పష్టంగా సూచించింది. మాగ్నెటిక్‌ స్ర్టిప్‌ కార్డులతో పోలిస్తే ఈఎంవి చిప్‌ ఆధారిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల భద్రత ఎక్కువ.
 

click me!