ఇండియాలో వెండి ధర ఎందుకు పెరిగిపోతుందో తెలుసా.. అసలు కారణాలు ఇవే..

By Ashok kumar Sandra  |  First Published Jun 6, 2024, 10:59 PM IST

వెండిని బంగారం లాంటి సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. ధర పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఆర్థిక అనిశ్చితి లేదా మార్కెట్ అస్థిరత సూచనలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు తరచుగా వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతారు.


ప్రస్తుతం దేశంలో వెండి ధర అనూహ్యంగా పెరిగింది. అయితే వెండి ధరను  ప్రభావితం చేసే అంశాలు ఏంటో తెలుసా ? భారతదేశంలో బంగారం చాలా  విలువైనప్పటికీ, వెండికి  కూడా దాదాపు అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం వెండి ధర అనూహ్యంగా పెరిగిపోతుంది. ఈ పెరుగుదల వెనుక గల కారణాలపై చాలా మంది అయోమయంలో ఉన్నారు.  

వెండిని బంగారం లాంటి సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. ధర పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఆర్థిక అనిశ్చితి లేదా మార్కెట్ అస్థిరత సూచనలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు తరచుగా వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతారు. కోవిడ్, భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు వెండితో సహా సురక్షితమైన ఆస్తులకు డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు వెండిపై డబ్బును పెట్టుబడి  పెడతారని  చెప్పవచ్చు. అందుకే వెండి ధర భారీగా పెరిగి పోతుంది. 

Latest Videos

అలాగే వెండికి ఇటీవలి కాలంలో పారిశ్రామిక డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ పవర్, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ పరిశ్రమలలో వెండి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలకు పెరుగుతున్న డిమాండ్ ఈ రంగాలలో వెండికి డిమాండ్ కనిపిస్తుంది. ఈ అధిక పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ధర పెరుగుదలకు దారితీసింది. 

అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా వెండి ధరల పెరుగుదలకు దోహదపడింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర US డాలర్‌లో ఉన్నందున, రూపాయి క్షీణించడం వల్ల భారతీయ వ్యాపారులకు వెండి దిగుమతులు మరింత ఖరీదైనవి చేసాయి. ఫలితంగా, భారతీయులు వెండిని అధిక ధరకు కొనాల్సి  వస్తుంది. 

భారతదేశంలో వెండికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత మరొక కారణం. సాంప్రదాయ, సాంస్కృతిక లోహంగా భారతదేశం అంతటా మతపరమైన వేడుకలు, వివాహాలు, పండుగలలో వెండిని, వెండి ఆభరణాలను ఉపయోగిస్తారు, ఇలాంటి అవసరాల కోసం వెండికి డిమాండ్ పెరిగినప్పుడు, ముఖ్యంగా పండుగ సీజన్లలో భారతీయ మార్కెట్లో వెండి ధర పెరిగిపోతుంది.

click me!