వారం రోజులు మాత్రమే ఛాన్స్.. ఆధార్ కార్డులో మార్పులు ఉంటే ఇలా అప్‌డేట్ చేసుకోండి..

By Ashok kumar Sandra  |  First Published Jun 6, 2024, 8:31 PM IST

 ఆధార్ ఉన్న  వ్యక్తులందరూ ఆధార్ సమాచారాన్ని రిజిస్టర్  చేసుకున్న తేదీ నుండి కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాలని  యూనిక్ ఐడెంటిఫికేషన్  అథారిటీ  అఫ్ ఇండియా (UIDAI) ఆదేశించింది.


భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు  డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్స్  తెరవడానికి, ప్రభుత్వ పథకాలు  పొందడానికి సహా దేనికైనా ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. ఆధార్‌ ఒక కీలక గుర్తింపు డాక్యుమెంట్  కాబట్టి  అందులో సమాచారం పూర్తిగా కచ్చితంగా ఉండాలి.  

అంతేకాకుండా, ఆధార్ ఉన్న  వ్యక్తులందరూ ఆధార్ సమాచారాన్ని రిజిస్టర్  చేసుకున్న తేదీ నుండి కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాలని  యూనిక్ ఐడెంటిఫికేషన్  అథారిటీ  అఫ్ ఇండియా (UIDAI) ఆదేశించింది. ఆధార్ కార్డ్ ఉన్న వారు  జూన్ 14 వరకు ఆధార్ రికార్డ్స్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.  ఆధార్ సెంటర్స్  ద్వారా ఈ సర్వీస్  పొందేందుకు రూ.50 చెల్లించాలి.
 
10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోని వారు ఇప్పుడు ఆధార్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు. myaadhaar.uidai.gov.in ద్వారా ఆధార్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత మీ పర్మనెంట్-అడ్రస్  డాక్యుమెంట్  అప్ డేట్ చేయవచ్చు. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వారు మాత్రమే ఆన్‌లైన్ సిస్టమ్‌ ఉపయోగించుకోగలరు. ఆధార్ సేవలను త్వరగా పొందాలంటే మొబైల్ నంబర్, ఇమెయిల్ తప్పనిసరిగా ఆధార్‌తో రిజిస్టర్  చేయాలి. ఇప్పటి వరకు ఆధార్‌లో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఇవ్వని వారు లేదా ప్రస్తుత ఆధార్‌లో మొబైల్ నంబర్ ఇంకా ఈ-మెయిల్ మార్చిన లేదా కొత్త ఈ-మెయిల్ ఉన్న వారు  ఆధార్ సెంటర్ల  ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.

Latest Videos

కొత్తగా  పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్  తప్పనిసరి. ఐదేళ్లలోపు పిల్లలు ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం బయోమెట్రిక్ సమాచారం తీసుకోదు. ఎన్రోల్మెంట్ కోసం పిల్లల బర్త్  సర్టిఫికేషన్  డాక్యుమెంట్, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ ఇస్తే సరిపోతుంది. పిల్లల బయోమెట్రిక్స్ తప్పనిసరిగా ఐదు సంవత్సరాల వయస్సు నుండి  15 సంవత్సరాల వయస్సు వరకు తప్పనిసరిగా రెన్యూవల్ చేసుకోవాలి. 

ఐదేళ్ల వయసులో తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యూవల్‌ను ఏడేళ్లలోపు, 15 ఏళ్లలోపు తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యూవల్ 17 ఏళ్లలోపు చేస్తేనే ఫ్రీ  రెన్యూవల్ సౌకర్యం  ఉంటుంది. లేదంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యూవల్ కోసం రూ.100 చార్జెస్  చెల్లించాలి.  జూన్ 14, 2024 తర్వాత ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసిప్పటికీ చార్జెస్ వర్తిస్తాయి. ఆన్‌లైన్ అప్‌డేట్‌లకు రూ.25, ఆఫ్‌లైన్ అప్‌డేట్‌లకు రూ.50 వసూలు చేయనున్నట్లు సమాచారం.

ఆధార్ కార్డ్‌లో అడ్రస్  ఎలా అప్‌డేట్ చేయాలి
*మొదట అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ని ఓపెన్  చేయండి 
'*MyAadhaar' మెను నుండి 'Update Your Aadhaar' అప్షన్ సెలెక్ట్  చేసుకొండి.
*ఆపై 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్‌లైన్' అప్షన్ పై క్లిక్ చేయండి.
*ఆధార్ కార్డ్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కోసం రీడిజైన్ చేయబడిన ఇంటర్‌ఫేస్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
*ఆధార్ అప్‌డేట్ చేయడానికి ప్రొసీడ్ ఆప్షన్‌ సెలెక్ట్ చేసుకోండి.
*మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను రిజిస్టర్  చేసి, క్యాప్చాను ఎంటర్  చేయండి
*రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్  చేయండి
*OTPని ఎంటర్ చేసిన తర్వాత మళ్లీ 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా' అప్షన్ పై క్లిక్ చేయండి.
*అడ్రస్ మార్చడానికి 'అడ్రస్' అప్షన్ పై క్లిక్ చేయండి.
*కొత్త అడ్రస్  సమాచారాన్ని ఎంటర్ చేయండి. వాటితో పాటు కొత్త అడ్రస్ వెరిఫికేషన్  ప్రూఫ్స్  అప్‌లోడ్ చేయండి
*మీ కొత్త అడ్రస్  సమాచారాన్ని ఎంటర్  చేయండి, అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి. అందించిన సమాచారం సరైనదేనని మళ్లీ కన్ఫర్మ్ చేయండి.
*సర్వీస్ కు సంబంధించిన ఏవైనా ఛార్జీలు ఏవైనా ఉంటే ఎంటర్ చేయండి
*అప్పుడు మీరు అందుకున్న URNతో స్టేటస్  చెక్ చేయవచ్చు

click me!