ఇంత మంచి నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు.. కశ్మీర్ ఘటనపై ఆనంద్ మహీంద్రా

By telugu teamFirst Published Aug 6, 2019, 9:39 AM IST
Highlights

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా స్పందించారు.


జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న్ సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. భారత ప్రజలంతా కశ్మీరులను ఆత్మీయ ఆలింగనం చేసుకోవాల్సిన సమయం ఇది అని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ కొన్ని నిర్ణయాల గురించి తెలుసుకున్నపుడు.. ఇలాంటి నిర్ణయాలు ఇంతకుముందే తీసుకుని ఉంటే బాగుండేది. అసలు అలా ఎందుకు జరగలేదు అని అనిపిస్తుంది. ఈరోజు(సోమవారం) తీసుకున్న నిర్ణయం కూడా అలాంటి కోవకు చెందినదే.  జాతీయ వర్గంలోకి చేరిన కశ్మీరీలను ఏ మాత్రం సంకోచం లేకుండా.. పూర్తిగా మనవారు అయ్యారనే భావనతో ఆత్మీయంగా హత్తుకోవాల్సిన సమయం ఇది’ అని మహీంద్ర గ్రూప్‌ అధినేత ట్వీట్‌ చేశారు.

ఆయన ట్వీట్ కి నెటిజన్లు కూడా అదేవిధంగా  స్పందిస్తున్నారు. ఇక ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే.. కశ్మీర్ కి 370 ఆర్టికల్ ని రద్దు చేయడంతోపాటు..  జమ్మూకశ్మీర్ ని రెండు భాగాలుగా విడగొట్టారు. అంతేకాకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ప్రకటించారు. 

click me!