బైజూస్ సక్సెస్ వెనుక ఉన్న మహిళ ఎవరు..క్లాస్ రూంకు డిజిటల్ రూపమిచ్చి 1.80 లక్షల కోట్ల సామ్రాజ్యంగా మార్చిన మహిళ

Published : Mar 23, 2023, 01:32 AM IST
బైజూస్ సక్సెస్ వెనుక ఉన్న మహిళ ఎవరు..క్లాస్ రూంకు డిజిటల్ రూపమిచ్చి 1.80 లక్షల కోట్ల సామ్రాజ్యంగా మార్చిన మహిళ

సారాంశం

ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు.ఒక్క ఆలోచన వారి జీవితాలనే మార్చేసింది. క్లాసు రూముకే పరిమితమైన పాఠాలను, ఇంటర్నెట్ ద్వారా విశ్వవ్యాప్తం చేసి, డిజిటిల్ ఎడ్యుకేషన్ విప్లవం సృష్టించిన బైజూస్ యాప్ నిర్మాణం వెనుక ఓ మహిళ పాత్ర ఉందంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఆమె ఎవరో, ఆమె ప్రస్థానం ఏంటో తెలుసుకుందాం. 

భారతదేశంలో అన్నిరంగాల్లో నిష్ణాతులైన మహిళలు ఎందరో ఉన్నారు. క్లిష్టపరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా రాత్రింబవళ్లు కష్టపడి పెద్దపెద్ద కంపెనీలు నిర్మించి ఎందరో మహిళలను మనం ఈ మధ్యకాలంలో చూడవచ్చు. విదేశాల్లో జాబ్ ఆఫర్ వచ్చి దేశంలోనే ఉంటూ దేశ పిల్లల్లో నాలెడ్జ్ పెంపొందించేందుకు కృషి చేస్తున్న బైజస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్ నాథ్ కూడా అలాంటి వారిలో ఒకరు. దివ్య చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకం. 

బైజస్‌లో అసోసియేట్ ఎడిటర్ దివ్య వయస్సు కేవలం 34 సంవత్సరాలు. ఆమె మొత్తం ఆస్తులు దాదాపు 3.05 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 22.3 వేల కోట్ల రూపాయలు. దివ్య తన భర్తతో కలిసి కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసింది. దివ్య ఎవరు, ఆమె ఇప్పుడు ఏమి చేస్తోంది అనే విషయం మనం తెలుసుకుందాం. 

దివ్య ఎవరు? : 
దివ్య బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి అపోలో హాస్పిటల్‌లో నెఫ్రాలజిస్ట్,  అతని తల్లి టెలివిజన్ షోలలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. దివ్య తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. కాలేజీలో సైన్స్ చదివిన దివ్య.. ఫ్రాంక్ ఆంథోనీ స్కూల్ తర్వాత ఆర్వీ ఇంజినీరింగ్ కాలేజీలో బయోటెక్నాలజీలో బీటెక్ చేసింది. దివ్య చదువుకునే సమయంలో రవీంద్రన్‌తో పరిచయం ఏర్పడింది. ఆమె చదువుకోవాలనే కోరిక చూసి రవీంద్రన్ ఉపాధ్యాయ వృత్తిలో చేరమని ప్రోత్సహించాడు.

దివ్య 2008లో తన కెరీర్‌ను ప్రారంభించింది: 
దివ్య 2008లో టీచర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. మొదట్లో, ఆమె బోధించిన పిల్లలు ఆమె కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే చిన్నవారు. క్లాస్‌లో బోధించడానికి చీర కట్టుకుని వెళ్లి కాస్త గంభీరంగా ఉండేలా ప్రయత్నం చేసేదాన్ని అని  దివ్య చెప్పింది. GRE పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, దివ్య అమెరికాలోని అనేక ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందింది. కానీ ఆమె దేశంలోనే ఉండి భర్త రవీంద్రన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది.

2011 ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ ప్రారంభం: 
దివ్య రవీంద్రన్ 2011లో ఆన్‌లైన్ విద్యా సంస్థను ప్రారంభించారు. దానికి బైజూస్ అని పేరు పెట్టారు. ఆమె భర్త రవీంద్రన్ గణితం బోధించేవాడు. ఆయన సహాయంతో మొదలైన బైజూస్ ప్రస్తుతం ఎడ్యుకేషన్ స్టార్టప్స్ లో ఎవరూ అందుకోలేని స్థాయికి ఎదిగింది.  

దివ్య మాట్లాడుతూ, "నాకు, పని జీవితం." ఏదైనా పనిని పూర్తి ప్యాషన్‌తో, కష్టపడి చేసినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందని దివ్య అన్నారు. ఇది కాకుండా బైజస్‌లోని కంటెంట్‌పై దివ్య ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. దేశంలోని ప్రతి మూలలో వివిధ ప్రదేశాలలో కూర్చొని విద్యార్థులకు బైజూస్ ద్వారా నేర్చుకోవడం సులభం. వారు ఏ విషయాన్ని అయినా సులభంగా అర్థం చేసుకోగలరు. విద్యార్థులకు సబ్జెక్ట్ సులభంగా అర్థమయ్యేలా చేయడమే మా లక్ష్యం అని దివ్య చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు