ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ రూ. 1,28 లక్షల కోట్ల విలువైన చానెల్ వ్యాపార సామ్రాజ్యానికి CEO లీనా నాయర్ ఎవరో తెలుసా ?

By Krishna AdithyaFirst Published Mar 22, 2023, 3:17 PM IST
Highlights

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన లీనా నాయర్ నేడు ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్ చానెల్ సీఈవోగా నిలిచారు. కెరీర్ ప్రారంభంలో ఆడపిల్లలు ఏమి చేయలేరు అనే నిషేధాలు, అడ్డంకులు తనను చుట్టుముట్టాయన్నారు.

లీనా నాయర్ ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ 'చానెల్'  మొదటి మహిళా CEO అయి చరిత్ర సృష్టించిన భారతీయ సంతతికి చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్. చానెల్ CE లీనా నాయర్ వయస్సు 52 సంవత్సరాలు.  కాగా యునిలీవర్  మొట్టమొదటి మహిళా, అతి పిన్న వయస్కురాలిగా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించిన లీనా నాయర్ జనవరి 2022లో యూనిలీవర్ నుండి CHRO పదవికి రాజీనామా చేసి. లీనా నాయర్ లండన్‌లో చానెల్ CEO గా బాధ్యతలు తీసుకున్నారు.  దీంతో ప్రముఖ గ్లోబల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, సత్య నాదెళ్ల, వంటి వారి సరసన లీనా నాయర్ పేరు చేరింది. 

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన లీనా నాయర్ నేడు ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్ సీఈవోగా నిలిచారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, అమ్మాయిలు ఏమి చేయగలరు, ఏమి చేయలేరు అనే  చాలా నిబంధనలు, నిషేధాలు, అడ్డంకులు తనను చుట్టుముట్టాయన్నారు. ఈ ప్రపంచంలో తాను సాధించలేనిది ఏదీ లేదని తన కష్టం, ప్రతిభతో ఇది సాధ్యం అయ్యిందన్నారు.  కె కార్తికేయన్ కుమార్తె ,   పారిశ్రామికవేత్తలు విజయ్ మీనన్ ,   సచిన్ మీనన్‌ల బంధువు అయిన లీనా మహారాష్ట్రలోని సాంగ్లీలోని వాల్‌చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ ,   టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైంది. 1992లో లీనా నాయర్ ఎక్సెలరీ జంషెడ్‌పూర్ నుండి హ్యూమన్ రిసోర్సెస్‌లో MBA పూర్తి చేసిన తర్వాత HULలో ట్రైనీగా చేరారు. 

ఫ్యాషన్ లెజెండ్ గాబ్రియెల్ "కోకో" 1910లో 'చానెల్'ని స్థాపించారు. ట్వీడ్ సూట్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పెర్ఫ్యూమ్‌లను ఉత్పత్తి చేస్తున్న చానెల్ ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ బ్రాండ్‌లలో ఒకటి. 2021 నాటికి, ఛానెల్ వార్షిక ఆదాయం సుమారు 15.6 బిలియన్ డాలర్లు. లీనా నాయర్ సాలరీపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.  లీనా నాయర్ రోల్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2021 కోసం ది గ్రేట్ బ్రిటిష్ బిజినెస్ ఉమెన్స్ అవార్డును గెలుచుకున్నారు. 2017లో, లీనా నాయర్‌ను క్వీన్ ఎలిజబెత్ UK, అత్యంత ప్రామిసింగ్ ఇండియన్ బిజినెస్ లీడర్‌లలో ఒకరిగా గుర్తించింది. ఫార్చ్యూన్ ఇండియా 2021 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ లిస్ట్‌లో కూడా కనిపించింది.

click me!