Closing Bell: బలమైన గ్లోబల్ సంకేతాలతో లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్, 140 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

By Krishna AdithyaFirst Published Mar 22, 2023, 4:35 PM IST
Highlights

బుధవారం సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 58215 వద్ద ముగిసింది. నిఫ్టీ 44 పాయింట్లు బలపడి 17152 వద్ద ముగిసింది.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. NSE నిఫ్టీ సూచీ 69.85 పాయింట్లు లాభపడిన 17,177 పాయింట్ల వద్దకు ముగిసింది. BSE సెన్సెక్స్ 286 పాయింట్లు లాభపడి 58,361 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి  40,016 పాయింట్ల వద్దు ముగిసింది. నిఫ్టీ 50లో హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, దివిస్ ల్యాబ్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లు కాగా, కోల్ ఇండియా, ఐటిసి, గ్రాసిమ్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్లుగా నష్టపోయాయి.

బుధవారం ఉదయం నుంచి ట్రేడింగ్‌లో నిఫ్టీ , సెన్సెక్స్ లాభాలత ప్రారంభమయ్యాయి. US ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటు నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో, సూచీలు హై నుంచి కరెక్షన్ కు గురయ్యాయి. NSE నిఫ్టీ ఒక దశలో 100 పాయింట్లు పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి 17,207ని తాకింది, అటు  బిఎస్‌ఇ సెన్సెక్స్ 350 పాయింట్లు ఎగబాకి 58,418.78 వద్ద డే గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 0.5% పెరిగి 40,085.60 వద్దకు చేరుకుంది. US ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) ఈరోజు సాయంత్రం తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది.పెట్టుబడిదారులను శాంతింపజేయడానికి US, యూరోపియన్ ప్రభుత్వాలు అదనపు నిధులు, బెయిల్-అవుట్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. తద్వారా బ్యాంకింగ్ సంక్షోభం నియంత్రణలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్నారు. 

ప్రపంచ మార్కెట్ ప్రభావం భారత్ కు అనుకూలంగానే ఉంది..

ఇదిలా ఉంటే వడ్డీ రేట్ల పెంపుదల గురించి US ఫెడ్  ప్రకటనకు ముందు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారతీయ, ఇతర అభివృద్ధి చెందుతున్న ఈక్విటీ మార్కెట్ల నుండి వైదొలగడం ప్రారంభించారు. అటు ముడి చమురు ధరలు పెరగడతంతో పాటు,  FIIల నిరంతర విక్రయాల ఫలితంగా రూపాయి క్షీణత కొనసాగుతోంది. అటు దిగుమతి బిల్లు పెరగడంతో కరెంట్ ఖాతా బ్యాలెన్స్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  కానీ వాస్తవానికి భారత రూపాయి విలువ క్షీణించడం ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా భారతీయ దేశీయ ఉత్పత్తిదారులకు అధిక ఆదాయం లభించే వీలుంది. GST వసూళ్లు, ఇంధన వినియోగం పరంగా చూసినట్లయితే అన్ని రకాలుగా ఆర్థిక వాతావరణం ఆరోగ్యంగానే ఉంది. కాబట్టి భారతీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు.

షేర్ బైబ్యాక్: ఇమామీ షేర్లు 8% పెరిగాయి
కంపెనీ బోర్డు షేర్ బైబ్యాక్‌ను పరిగణించిన తర్వాత మార్చి 22న మధ్యాహ్నం సెషన్‌లో ఇమామీ షేరు ధర 8 శాతానికి పైగా పెరిగింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం మార్చి 24న జరగనుందని, ఇందులో కంపెనీ పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఇమామి బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపింది. 

click me!